సినిమా గాసిప్స్సినిమా వార్తలు

₹1000 కోట్ల లిక్కర్ స్కాం షాక్: డిప్రెషన్‌లో హీరోయిన్ ? ఇండస్ట్రీలో కలకలం!

తమిళనాడుని కుదిపేస్తున్న ₹1000 కోట్ల లిక్కర్ స్కాంలో కొత్తగా ఒక షాకింగ్ ట్విస్ట్ బయటకు వచ్చింది. చెన్నై టాస్మాక్ ప్రధాన కార్యాలయం నుంచి ప్రైవేట్ లిక్కర్ ఫ్యాక్టరీల వరకు ఈడీ రైడ్స్ జరగడంతో, సౌత్ సినీ వర్గాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి.

ఈడీ దాడుల తర్వాత, ఈ కుంభకోణంలో ఉన్నవారు నిర్వహించిన నైట్ పార్టీలకు హాజరైన వారిలో హీరోయిన్ కయదు లోహర్ పేరు కూడా బయిటకు వచ్చింది. పార్టీలకు వచ్చినందుకు ఆమెకు ₹35 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం జరిగిందని వార్తలు పాకాయి.

“ఇది మొత్తం అబద్ధం… ఈ వార్తలు నా మనస్సుని విరిచేశాయి!” — కయాదు ఎమోషనల్ రియాక్షన్

కయాదు ఈ ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేసింది. “ఈ రూమర్స్ నన్ను తీవ్రంగా బాధించాయి. నా కెరీర్ సరిగ్గా సెటిల్ అవుతున్న టైంలో ఇలాంటి ఆరోపణలు రావడం చాలా హర్ట్ అయ్యే విషయం. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. కానీ ఈ వార్తలతో నేను డిప్రెషన్‌కు వెళ్లిపోయాను” అని ఆమె బాధను వెలిబుచ్చింది.

ప్రదీప్ రంగనాథ్‌తో చేసిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమా కయాదుకు మంచి హైప్ తెచ్చిపెట్టింది.
విశ్వక్ సేన్ నటిస్తున్న ‘ఫంకీ’ లో కూడా ఆమెనే హీరోయిన్.
అంతేకాదు… తమిళంలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌ల కూడా ఆమె చేతిలో ఉన్నాయి.

Similar Posts