సినిమా వార్తలు

ఏ పని చేయకపోయినా నెలకి 5 కోట్లు! 38 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన టాప్ సింగర్.. ఈ రేంజ్ ఇన్కమ్ ఎవరికైనా సాధ్యమా?

ఘంటసాల, ఎస్పీ బాలు వంటి దిగ్గజాలు ఊపిరి ఉన్నంత వరకు పాటలు పాడారు. ఇప్పటికీ ఏసుదాస్ వంటి వారు పాడుతూనే ఉన్నారు. కానీ, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండి, దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ఊపేస్తున్న ఒక స్టార్ సింగర్.. 38 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆయనే ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ సింగర్ అర్జిత్ సింగ్!

పాట పాడకపోయినా ఏటా 70 కోట్లు!

అర్జిత్ సింగ్ కేవలం పాటలు పాడటం మానేశాడు కానీ, సంపాదించడం కాదు! ఆయనకు ఉన్న ఆస్తి విలువ తెలిస్తే ఎవరైనా కళ్ళు తిరగాల్సిందే. అర్జిత్ సింగ్ ప్రస్తుత నెట్ వర్త్ అక్షరాలా 414 కోట్లు! ఒక్క పాటకి 10 లక్షలు తీసుకునే అర్జిత్.. ఇకపై సినిమాలు వదిలేసినా ఆయన పాడిన పాత పాటల ద్వారా వచ్చే రాయల్టీయే ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది. స్పాటిఫై, యూట్యూబ్, ఆడియో కంపెనీల నుండి ఆయనకు ఏడాదికి 70 కోట్ల రూపాయల రాయల్టీ వస్తుంది. అంటే ఒక్క నెలకి 5 కోట్ల రూపాయల పైనే ఇన్కమ్! నిద్రపోయి లేచినా ఆయన అకౌంట్లో లక్షలు వచ్చి పడుతున్నాయి.

ఎందుకు ఈ షాకింగ్ డెసిషన్?

సినిమా పాటలకి స్వస్తి చెప్పిన అర్జిత్.. పూర్తిగా పనికి గుడ్ బై చెప్పలేదు. లైవ్ కాన్సర్ట్స్, ప్రైవేట్ సాంగ్స్ చేస్తూనే ఉంటాడు. అంతేకాదు, ఇప్పుడు ఆయన చూపు సినిమా నిర్మాణం (Film Production) వైపు మళ్లిందట. కేవలం సింగర్‌గానే కాకుండా మేకర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

కోట్లు సంపాదించిన తర్వాత విలాసవంతమైన జీవితం కంటే, తనకు నచ్చిన పని చేయడానికే ఈ రిటైర్మెంట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏ పని చేయకుండానే నెలకి 5 కోట్లు సంపాదించే అర్జిత్ రేంజ్ చూసి నెటిజన్లు “ఇది కదా అసలైన సెటిల్మెంట్” అని కుళ్ళుకుంటున్నారు!

Similar Posts