నందమూరి తారక రామారావు (NTR) తన బ్రాండ్ వాల్యూని, తన వ్యక్తిత్వ హక్కులను కాపాడుకోవడానికి ఒక భారీ యుద్ధమే చేసి గెలిచారు. ఎన్టీఆర్ పేరును, ఆయన ఫోటోలను ఇష్టానుసారంగా వాడుతూ లాభపడుతున్న వారికి ఢిల్లీ హైకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఎన్టీఆర్ అనుమతి లేకుండా ఆయన ఐడెంటిటీని వాడితే ఇక చట్టపరమైన చర్యలు తప్పవని కోర్టు క్లియర్ గా వార్నింగ్ ఇచ్చింది.

“యంగ్ టైగర్”.. “మ్యాన్ ఆఫ్ మాసెస్” ఇక ఎన్టీఆర్ సొంతం!

సాధారణంగా సెలబ్రిటీల పేర్లను, బిరుదులను బిజినెస్ కోసం చాలామంది వాడుతుంటారు. కానీ ఇకపై ఎన్టీఆర్ విషయంలో అది కుదరదు. “NTR”, “Jr NTR”, “Tarak”, “Man of Masses”, “Young Tiger” వంటి పేర్లను కానీ, ఆయన గొంతును కానీ, కనీసం ఆయన పోలికలతో ఉండే ఇమేజ్‌లను కానీ కమర్షియల్ గా వాడితే అది నేరమే అవుతుంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు గట్టి ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చింది.

AI వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలకు చెక్!

ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడి ఎన్టీఆర్ లాంటి స్టార్ల గొంతును, ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇకపై అలాంటి వీడియోలు కనిపిస్తే వెంటనే వాటిని తొలగించాలని డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌ను కోర్టు ఆదేశించింది. ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులు (Personality Rights) ఆయన ప్రాథమిక హక్కులలో భాగమని హైకోర్టు గుర్తించడం విశేషం.

ఎన్టీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా లేదా ఆయన అనుమతి లేకుండా ఆయన పేరుతో సొమ్ము చేసుకునే వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే కఠినమైన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

#AI, #Delhi High Court, #NTR, #NTR Wins Battle For Identity, #Personality Rights

By admin