వయసు అనేది మలైకా అరోరాకు కేవలం సంఖ్య మాత్రమే. 50 దాటి, విడాకుల తర్వాత కూడా – గ్లామర్ పరంగా ఆమెకి పోటీదారులే లేరని మరోసారి నిరూపించుకున్నారు. కొడుకు పెద్దవాడైనా, మలైకా లైఫ్‌స్టైల్ మాత్రం ఇంకా బోల్డ్‌గానే కొనసాగుతోంది.

అత్యంత చర్చనీయమైన రొమాన్స్‌గా నిలిచిన మలైకా – అర్జున్ కపూర్ లవ్‌స్టోరీకు ఇటీవలే బ్రేకప్ వచ్చిందని బాలీవుడ్‌ చెబుతున్న సంగతి తెలిసిందే. మలైకా కంటే 11 ఏళ్లు చిన్నవాడు అయిన అర్జున్‌తో ఆమె చాలా ఏళ్లు డేటింగ్‌లో ఉండి, చివరికి బ్రేకప్ తో వేరే దారులు పట్టారు.

కానీ… శనివారం అర్జున్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా మలైకా చేసిన పని హాట్ టాపిక్ అయ్యింది.

“టచ్ చేసి చూడు” అన్నట్టు… ఓ స్నేహపూర్వక వీడియోతో పాటు “హ్యాపీ బర్త్‌డే, స్టే ఫ్యాబ్యులస్” అని అర్జున్‌కు విష్ చెప్తూ ఆమె పోస్ట్ పెట్టింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు అసలు బ్రేకప్ జరిగిందా? లేక మళ్లీ మ్యూచువల్‌గా కలుస్తున్నారా? అంటూ కామెంట్లతో అదర కొట్టేస్తున్నారు.
“ఇంకా మనసుల్లో ప్రేమ మిగిలి ఉందేమో…” అంటూ ఫ్యాన్స్ ఊహాగానాలతో షికారు చేస్తున్నారు.

ఇక మలైకా ప్రస్తుతంగా కొత్త సినిమాలు ఏవీ చేయడం లేదు. టీవీ షోలకే పరిమితమైపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఫోటోషూట్లు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన హింట్లు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

సంప్రదాయాన్ని బాహాటంగా తుడిచేసిన బ్యూటీ… ప్రేమను ఇలా తిరిగి టచ్ చేస్తుందా? అనేది ఇప్పుడు హాట్ డిబేట్!

,
You may also like
Latest Posts from