ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల యుగం. ఒకే కథ, ఒకే విజన్‌తో దేశమంతా కనెక్ట్ కావాలంటే… టైటిల్ నుంచే ఓ మోస్తరైన కిక్కు ఉండాలి. రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కూలీ’ సినిమా టైటిల్‌కు వచ్చిన హిందీ వెర్షన్ కంట్రవర్సీ చూసిన తర్వాత… ఈ మాట సత్యమని తెలిసొస్తోంది.
ఇప్పటికే నాగార్జున, ఉపేంద్ర, శత్యరాజ్, శృతిహాసన్, రేబా మోనికా జాన్ లాంటి స్టార్ కాస్టింగ్‌తో భారీ బడ్జెట్‌పై రూపొందుతున్న ‘కూలీ’ సినిమా… ఫస్ట్ లుక్ నుంచి హైప్ సృష్టిస్తోంది.
అయితే కొన్ని రోజుల కిందట ఈ సినిమా హిందీ టైటిల్‌ను ‘Majdoor’ అని ప్రకటించగా… ఆ పేరు వివాదాస్పదమయ్యింది. సెన్సిటివ్ కమ్యూనిటీల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. టోన్, క్లాస్, మాస్ అన్నింటికీ అసంతృప్తిగా మారిపోయింది.
ఈ నేపథ్యంలో నిర్మాతలు Sun Pictures డ్యామేజ్ కంట్రోల్ మోడ్‌లోకి వెళ్లారు. తాజాగా హిందీ వెర్షన్ కొత్త టైటిల్‌ను రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు –
“Coolie: The Powerhouse” అని పేరు మార్చారు.
“Deva’s rage begins in 50 days” అనే ట్యాగ్‌లైన్‌తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇది టైటిల్ విషయంలో జాగ్రత్తగా తీసుకున్న తెలివైన నిర్ణయం అని అభిమానులు కూడా ప్రశంసిస్తున్నారు.
ఇక ‘కూలీ’ సినిమా విడుదల తేదీగా ఆగస్ట్ 14 టార్గెట్ చేస్తున్నారు. అదే రోజు ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వస్తున్న War 2 కూడా విడుదల కానుంది. రెండు సినిమాల మధ్య గట్టి క్లాష్ జరగనుంది.
అనిరుధ్ మ్యూజిక్, లోకేష్ టేకింగ్, రజనీ స్టైల్, మరియు ఇప్పుడు ‘Coolie: The Powerhouse’ అనే యూనివర్సల్ టైటిల్… ఈ సినిమాకి పాన్ ఇండియా మార్కెట్ రెడీగా ఉన్నట్లే!