రెండు తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ కేస్ ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వారందరిపై కూడా ఇప్పుడు కేసు ఫైల్ అయిన విషయం తెలిసిందే. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై పని గట్టుకొని మరీ వారి రహస్యాలను బయటకు తీస్తూ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్.
ఆ క్రమంలో ఇప్పుడు అతిపెద్ద తిమింగలం సోనూసూద్(Sonusood) అంటూ హాట్ బాంబ్ పేల్చారు. ఏకంగా రూ.1000 కోట్ల స్కామ్ లో సోనూ సూద్ హస్తం ఉంది అంటూ నా అన్వేషణ అన్వేష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియో కూడా రిలీజ్ చేశారు.
ఆ వీడియోలో ఏముంది అంటే… సోనూసూద్ బెట్టింగ్ సామ్రాజ్యానికే అధినేత. కరోనా టైంలో సోనూసూద్ ను కలియుగ కర్ణుడు అన్నారు. అయితే అలాంటి కర్ణుడు రాక్షసుడుగా మారి వేల కోట్లు ఎలా సంపాదించాడు. నేను ప్రూఫ్లతో సహా మీకు చూపిస్తాను. పేద కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకొని, అలా వచ్చిన డబ్బులు అన్నింటిని కూడా సహాయం చేసేసారు.
అటు ఈయన భార్య నిర్మాత. రూ.50 కోట్లు పెట్టి సినిమా తీశారు. అంతా దానం చేసే వీరికి రూ.50 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. ఈయన కర్ణుడికి ప్రతిరూపం కదా.. వచ్చిన ప్రతి రూపాయి కూడా దానం చేస్తూ వెళ్లిపోయారు. పైగా ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఈ మధ్య ఫ్లాప్గానే మిగిలాయి. కలెక్షన్స్ అంతా కలిపినా కూడా రూ. 20 కోట్లు మాత్రమే వచ్చాయి.
ఇంకా రూ.30 కోట్ల నష్టం సంగతి ఏంటి..? ఇక ఈ రూ.50 కోట్లు ఎలా వచ్చాయంటే అది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్. రూ.50 కోట్లు కాదు దాదాపు రూ.1000 కోట్ల వరకు బెట్టింగ్ యాప్స్ ద్వారానే అతిపెద్ద స్కాం చేశారు.
అటు హర్ష సాయి, ఇటు సోనూ సూద్ ఇద్దరు అన్నదమ్ముల లాంటి వాళ్లు అంటూ సోనుసూద్ రహస్యాన్ని వీడియో ద్వారా రిలీజ్ చేశారు నా అన్వేషణ అన్వేష్.