బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ తో తెలుగు దర్శకుడు మలినేని గోపీచంద్ తెరకెక్కించిన ‘జాట్’ చిత్రం గురువారం విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది.
ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాతలు, ఉత్తరాది నిర్మాణసంస్థతో కలసి నిర్మించడం విశేషం కాగా, మన తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ఈ సినిమాతోనే హిందీ చిత్రసీమలో దర్శకునిగా అడుగుపెట్టారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కలెక్షన్స్ పరిస్దితి ఏమిటో చూద్దాం.
సన్నీ డియోల్ జాట్ బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరుగా ప్రారంభమైంది . నిర్మాతలు అధికారికంగా ఈ చిత్రానికి 20 Cr+ ప్రారంభాన్ని ఆశిస్తున్నారని చెప్పారు, అయితే సన్నీ డియోల్ యొక్క JAAT నిర్మాతల అంచనాలలో సగం మాత్రమే రాబట్టింది. బాలీవుడ్ ట్రేడ్ రిపోర్ట్ ల ప్రకారం భారతదేశంలో 9-10 కోట్ల రేంజ్ నెట్‌తో ఈ చిత్రం ఓపెన్ అయ్యిందని తెలుస్తోంది.
JAAT వీకెండ్ లో మంచి జంప్ తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు. సన్నీ డియోల్ మాస్ బెల్ట్‌లలో పెద్ద స్టార్, ఇక్కడ సినిమా బాగా వర్కవుట్ అవుతుంది. అయితే సిటీలు, ప్లెక్స్‌ల వంటి ప్రధాన డబ్బు స్పిన్నర్లు దగ్గర మాత్రం పెద్దగా ఆక్యుపెన్సీ ఉండదు. ఇది ఖచ్చితంగా కలెక్షన్స్ ని ప్రభావితం చేస్తుంది. ‘గదర్-2’ ఊపులో వచ్చిన ‘జాట్’ సన్నీ డియోల్ ఫ్యాన్స్ ను అలరించే అంశాలతో తెరకెక్కింది.