సినిమా వార్తలు

నాగార్జున-టబు మధ్య ఏం జరుగుతోంది! బెడ్ రూమ్ నుంచి అర్థరాత్రి ఫోన్ కాల్స్..?

టాలీవుడ్ ‘మన్మథుడు’ అక్కినేని నాగార్జున, అందాల భామ టబు.. ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై ఎంత పండాయో, ఆఫ్-స్క్రీన్ లో కూడా వీరి స్నేహం అంతకంటే ఎక్కువే చర్చనీయాంశమైంది. అయితే, ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి కనిపించబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’ లో టబు ఉండబోతోందని కన్ఫర్మ్ చేసి రూమర్లకు కొత్త రెక్కలు తొడిగారు!

అర్థరాత్రి ఫోన్ కాల్స్.. అమలకు కూడా తెలుసు!

నాగార్జున ఒక ఇంటర్వ్యూలో టబుతో తనకున్న బాండింగ్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. “టబు నాకు బెస్ట్ ఫ్రెండ్. అర్ధరాత్రి తన బెడ్ రూమ్ లో ఉన్నప్పుడు కూడా నేను ఫోన్ చేయగలిగే ఏకైక వ్యక్తి తనే. ఈ విషయం నా భార్య అమలకు కూడా తెలుసు” అని ఓపెన్ గా చెప్పేశారు. అంటే వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

‘కింగ్ 100’ లో మళ్ళీ రొమాన్స్.. కానీ ఇక్కడే ట్విస్ట్!

నాగార్జున కెరీర్ లో మైలురాయి లాంటి 100వ సినిమాలో టబు ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించబోతోంది. “నేను వందో సినిమా చేస్తున్నానని తెలియగానే, తనే ఫోన్ చేసి ఆ సినిమాలో నేను ఉండాలని కోరింది” అని నాగ్‌ స్వయంగా వెల్లడించారు. అయితే, గతంలో ‘నిన్నే పెళ్లాడతా’లో లాగా రొమాంటిక్ ట్రాక్ కాకుండా, ఈసారి నాగ్ ‘సేఫ్ గేమ్’ ఆడుతున్నారు. సినిమాలో టబుది చాలా కీలకమైన పాత్ర అని, కానీ ఆమెతో రొమాన్స్ ఉండదని సమాచారం. ఈ సినిమాలో ఇంకో ఇద్దరు యంగ్ హీరోయిన్లతో నాగ్ రొమాన్స్ చేయబోతున్నారట!

రియలిస్టిక్ యాక్షన్.. గ్రాఫిక్స్‌కి నో!

తమిళ దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి నాగ్‌ మరో అప్‌డేట్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆడియన్స్ టేస్ట్ మారిపోయిందని, అందుకే ఇందులో యాక్షన్ సీన్లు అన్నీ చాలా నేచురల్‌గా, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కి తావు లేకుండా ఉండాలని డిసైడ్ అయ్యారట. రాజీ పడకుండా ఈ సినిమాను ఒక క్లాసిక్ గా మార్చేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ కసరత్తు చేస్తోంది.

మొత్తానికి టబు మళ్ళీ తెలుగు తెరపై, అది కూడా నాగార్జున సినిమాలో మెరవబోతుండటంతో అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Similar Posts