నందమూరి బాలకృష్ణ (NBK) అంటేనే భారీతనం.. మాస్ జాతర! కానీ ఇప్పుడు బాలయ్య తన 111వ సినిమా విషయంలో ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ టాక్. తన గత సినిమాల బడ్జెట్ రికార్డులను బ్రేక్ చేస్తూ.. ఇప్పుడు ఏకంగా బడ్జెట్ తగ్గించుకోవాలని డైరెక్టర్‌కు కండిషన్ పెట్టారట. అసలు బాలయ్య ఇంతలా వెనక్కి తగ్గడానికి కారణం ఏంటి? ‘అఖండ 2’ రిజల్ట్ దీనికి కారణమా?
180 కోట్లు వద్దు.. 130 కోట్లు చాలు!
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఒక పీరియడ్ ఫోక్లోర్ డ్రామా (జానపద చిత్రం) చేయాల్సి ఉంది. దీని కోసం మొదట రూ. 180 కోట్లకు పైగా బడ్జెట్ అనుకున్నారు. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి ఒక పక్కా లోకల్ మాస్ యాక్షన్ స్టోరీని బాలయ్య ఓకే చేశారట. ఈ సినిమా బడ్జెట్‌ను రూ. 130 కోట్ల లోపే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
అఖండ 2 ఎఫెక్ట్ పడిందా?
‘అఖండ 2’ సినిమా పాన్-ఇండియా స్థాయిలో ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ చూపించకపోవడంతో, బాలయ్య అండ్ టీమ్ తమ స్ట్రాటజీని మార్చేశారట. అనవసరమైన గ్రాఫిక్స్, భారీ సెట్స్ కోసం కోట్లు తగలేయడం కంటే.. మన తెలుగు ఆడియన్స్‌కు నచ్చేలా ‘డార్క్ అండ్ ఇంటెన్సివ్’ రోల్‌లో బాలయ్యను చూపించాలని గోపీచంద్ ఫిక్స్ అయ్యారు. బాక్సాఫీస్ దగ్గర నిర్మాత సేఫ్ జోన్‌లో ఉండాలనే ఉద్దేశంతోనే బాలయ్య ఈ ‘బడ్జెట్ ఫ్రెండ్లీ’ డెసిషన్ తీసుకున్నారట.
OTT మార్కెట్ డౌన్.. అందుకే ఈ జాగ్రత్త!
ప్రస్తుతం టాలీవుడ్‌లో OTT డీల్స్ 30 శాతం వరకు తగ్గిపోయాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా అటూ ఇటూగా ఉండటంతో.. నిర్మాతలు నష్టపోకుండా ఉండాలంటే బడ్జెట్ కంట్రోల్‌లో ఉండటం అవసరమని బాలయ్య భావిస్తున్నారట. “తెలుగు రాష్ట్రాల నుంచే మెజారిటీ కలెక్షన్స్ రికవరీ అవ్వాలి.. మిగిలిందంతా బోనస్” అనే కొత్త ఫార్ములాతో బాలయ్య ముందుకు వెళ్తున్నారు.
గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ కొత్త స్ట్రాటజీతో బాలయ్య-గోపీచంద్ మళ్ళీ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి!

