ఒకప్పుడు థియేటర్ల చుట్టూ సినిమాల కోసం క్యూ కట్టేవాళ్లు… ఇప్పుడు ఓటీటీల వేదికల దగ్గర అలాంటి పరిస్దితి ఉంటోంది. వర్క్‌లో బిజీగా ఉన్నా, ట్రాఫిక్‌లో ఇరుక్కున్నా, పాపం నిద్రలేని ఉన్నా ఒక స్మార్ట్‌ఫోన్ లేదా టీవీ స్క్రీన్ ఉంటే చాలు. అలాంటి ఓటీటీ హంగామాలో నెట్‌ఫ్లిక్స్ ఈ వారం మొత్తం అదిరిపోయే సినిమాల పండుగగా మార్చేస్తోంది!
ఈ వారం నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు నిజమైన సెలబ్రేషన్ మూడ్ తీసుకువచ్చింది. ఒక్క వారం వ్యవధిలోనే మూడు స్టార్ హీరోల భారీ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తూ ఓ మాస్ ఫెస్టివల్ మాదిరిగా ముంచెత్తుతోంది.
ముందుగా సల్మాన్ ఖాన్ మరియు రష్మిక మందన్నా జంటగా నటించిన “సికందర్” సినిమా మే 25 (ఆదివారం) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంటి కంఫర్ట్‌లో ఆ మాస్ ఎంటర్టైన్మెంట్ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇంకా ఓ భారీ అప్డేట్:
నేచురల్ స్టార్ నాని నటించిన క్రైమ్ థ్రిల్లర్ “హిట్: ది థర్డ్ కేస్” మే 29న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. పలు భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుండటంతో, ఈ సారి హిట్ కేసు మరింత రీచ్ అవ్వనుంది.
తర్వాత సూర్య – పూజా హెగ్డే జంటగా నటించిన “రెట్రో” మే 31న ఓటీటీలో అడుగుపెట్టనుంది. బాక్సాఫీస్ వద్ద ఆశించినంత హిట్టు కాకపోయినా… ఓటీటీ ఆడియన్స్ దాన్ని ఎలా స్వీకరిస్తారో ఇప్పుడు అంతా అక్కడే ఫోకస్ పెట్టారు.
ఒక్క వారం గ్యాప్‌లోనే మూడు భారీ సినిమాలు… మాస్, మిస్టరీ, మెలోడీ అన్నీ కలిపి విందే. నెట్‌ఫ్లిక్స్ మాత్రం ఓటీటీలో ‘ఇంటర్టైన్మెంట్కి ఎక్కడ బ్రేక్ లేదు’ అనేలా మనలను బుక్ చేసింది!