బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ అన్నా, మాస్ ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్. అలాంటి కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ 2’ కోసం ఫ్యాన్స్ చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కు ఏర్పాట్లుజరిగాయి. స్పెషల్ ప్రీమియర్స్ , టిక్కెట్ రేట్లు హైక్ కు ఫర్మిషన్స్ వచ్చాయి. అయితే గత 24 గంటల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రీమియర్స్ రద్దు, సోషల్ మీడియాలో వార్తలు, చివరకు అధికారిక ప్రకటన – అన్నీ కలిపి సినిమా వాయిదా ఖాయమైంది.
సినిమా వల్ల కాదు… కోర్టు వల్ల
సాధారణంగా రిలీజ్ వాయిదా అంటే టెక్నికల్ డిలే, సెన్సార్, కాపీ ఇష్యూలు అనే అనుమానం వస్తుంది. కానీ ఇక్కడ అసలు సమస్య సినిమాతో సంబంధమే లేదు. ఈ సమస్య 2011లో వచ్చిన ‘దూకుడు’ సినిమాకి సంబంధించిన పాత ఫైనాన్షియల్ డ్యూ.
ఆ సినిమా కోసం Eros International , 14 Reels Entertainment మధ్య ఒప్పందం జరిగింది. తర్వాత చెల్లింపుల విషయంలో వివాదం వచ్చి అర్బిట్రేషన్ వరకు వెళ్లింది. 2019లో తీర్పు వచ్చింది: ₹11.23 కోట్లు ఇవ్వాలి, అప్పు తీర్చేవరకు సినిమా హక్కులు డీల్ చేయొద్దు.
అదే తీర్పు High Court, Division Bench, Supreme Court – అన్ని చోట్ల ఫైనల్ అయ్యింది. కానీ డబ్బు చెల్లించబడలేదు.
ఈ సమయంలో అఖండ 2 ఎంట్రీ.
కొత్త సంస్థ.. కొత్త రిలీజ్ ప్లాన్.. కోర్టు అనుమానం
‘అఖండ 2’ రిలీజ్ 14 Reels Entertainment ద్వారా కాకుండా 14 Reels Plus LLP పేరుతో చేయాలని నిర్ణయించారు. ఇక్కడే విషయం క్లిష్టమైంది.
Eros వాదన:
ఇది అదే కుటుంబం, అదే ప్రమోటర్లు ఈ సంస్థను అల్టర్ ఈగోలా ఉపయోగిస్తున్నారు. ఆదాయం దాచిపెట్టి అప్పు తప్పించుకోవడమే లక్ష్యం. ఇందుకే Eros కోర్టులో Section 9 petitions వేసింది. డబ్బు క్లియర్ చేస్తేనే సినిమా రిలీజ్ అనే అభ్యర్థన. ఒక దశలో Single Judge ఆ పిటిషన్లను డిస్మిస్ చేసి రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, Division Bench పూర్తిగా విరుద్ధంగా తీర్పు ఇచ్చింది.
ఇంజంక్షన్: డబ్బు ఇచ్చేవరకు రిలీజ్ లేదు
Division Bench స్పష్టం చేసింది:
Single Judge ఆర్డర్ రద్దు
కేసు మళ్లీ విచారణకు
₹11.23 కోట్లు చెల్లిస్తేనే రిలీజ్
అంటే:
ప్రీమియర్స్ లేదు
థియేటర్స్ లేదు
OTT లేదు
డిస్ట్రిబ్యూషన్ లేదు
అఖండ 2 అధికారికంగా ఆగింది. ఇప్పటికి కొత్త విడుదల తేదీ లేదు.
నిర్మాణ సంస్థ స్పందన , 14 Reels Plus ఎక్స్‌లో ప్రకటించింది:
“అనివార్య కారణాల వల్ల సినిమా షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదు. అభిమానులకు నిరాశ కలిగించినందుకు చింతిస్తున్నాం.
సమస్యను త్వరగా పరిష్కరించేందుకు పనిచేస్తున్నాం.”

