తమిళనాడులో నీతులు.. ఇక్కడ కుల పిచ్చి? ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విలన్ పార్థిబన్ సెల్ఫ్ గోల్.. నెటిజన్ల ట్రోలింగ్‌తో సోషల్ మీడియా షేక్!
వివరాల్లోకి వెళితే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్ అప్పుడే సెగలు పుట్టిస్తున్నాయి. నిన్న హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో సినిమా విశేషాల కంటే, తమిళ నటుడు పార్థిబన్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి. స్టేజీపైకి రాగానే అందరూ సినిమా గురించి మాట్లాడతారని ఆశిస్తే, పార్థిబన్ మాత్రం తన కులం గురించి ప్రస్తావించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తనను తాను ఒక ‘నాయుడు’ అబ్బాయిగా పరిచయం చేసుకోవడం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది.

స్టేజీపై పార్థిబన్ ఏమన్నారంటే?
“నా పేరు రాధాకృష్ణన్ పార్థిబన్. నేను ఒక నాయుడు అబ్బాయిని. అవును, పక్కా నాయుడు అబ్బాయినే” అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. చెన్నైలో పుట్టి పెరగడం వల్ల తెలుగు రాదని, కానీ తన మూలాలు ఇక్కడే ఉన్నాయనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పార్థిబన్ పవర్‌ఫుల్ విలన్ రోల్ పోషిస్తున్నారు. అయితే ప్రొఫెషనల్ ఈవెంట్‌లో ఇలా సామాజిక వర్గాల గురించి మాట్లాడటం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తమిళ తంబీల రివర్స్ ఎటాక్!
The so-called Intellectual #Parthiban calls Tamils as "Arava" 😮👀👎🏼
— #UstaatBhagatSingh Pre Release Event pic.twitter.com/dLgsKdU6yZ
— VCD (@VCDtweets) March 17, 2026
తమిళనాడులో ద్రావిడ సిద్ధాంతం, కుల రహిత సమాజం గురించి గొప్పలు చెప్పే పార్థిబన్, పక్క రాష్ట్రానికి రాగానే ఇలా కులం కార్డు తీయడం ఏంటని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో పక్కన ఉన్నప్పుడు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ మాట్లాడటం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్స్ ఇంటర్నెట్‌లో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. సినిమా రిలీజ్‌కు ముందే ఈ రేంజ్ వివాదం రాజకోవడం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్‌కు కూడా తలనొప్పిగా మారింది.
పార్థిబన్ వ్యాఖ్యలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి ఈ వివాదం సినిమా హైప్‌ను పెంచుతుందో లేక నెగిటివ్ అవుతుందో వేచి చూడాల్సిందే.

