సినిమా వార్తలు

“చరణ్.. నువ్వు రాకపోతే నే వస్తా!” అంటున్న పవన్, మనమే చూసుకుందాం

2026 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో, ఇప్పుడు అందరి దృష్టి సమ్మర్ సీజన్ పై పడింది. ముఖ్యంగా మార్చి నెలాఖరున విడుదల కావాల్సిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ (Peddi) చుట్టూ ఇప్పుడు రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకవేళ చరణ్ తప్పుకుంటే ఆ ప్లేస్ లోకి పవన్ కళ్యాణ్ రాబోతున్నాడనే వార్త ఫిల్మ్ నగర్లో షేక్ చేస్తోంది.

‘పెద్ది’ వాయిదా పడనుందా?

దర్శకుడు బుచ్చిబాబు సన – రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ‘పెద్ది’ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేస్తామని మేకర్స్ పదే పదే చెబుతున్నారు. అయితే, ఇంకా కొంత షూటింగ్ మరియు భారీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్‌లో ఉండటం.. అలాగే టిక్కెట్ ధరల పెంపుపై కోర్టు ఇస్తున్న తీర్పుల నేపథ్యంలో ఈ సినిమా సమ్మర్ చివరకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

లైన్ లోకి పవర్ స్టార్..

ఒకవేళ మార్చి 27వ తేదీ ఖాళీ అయితే, ఆ డేట్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) తో భర్తీ చేయాలని చూస్తున్నారట.

OG ఎఫెక్ట్:

ఇప్పటికే ‘OG’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన పవన్, ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.

హరీష్ శంకర్‌కు సవాల్:

మార్చి 27కి సినిమా రావాలంటే డైరెక్టర్ హరీష్ శంకర్ చాలా స్పీడ్ పెంచాలి. ఇంకా కొంత ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు బాకీ ఉన్నాయి.

ఓవర్సీస్ టెన్షన్..

గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలైన ‘హరి హర వీరమల్లు’, ‘OG’ విడుదల సమయంలో ఓవర్సీస్ ప్రింట్స్ ఆలస్యమై ప్రీమియర్స్ దెబ్బతిన్నాయి. ఈసారి అటువంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే కనీసం వారం రోజుల ముందే ఫైనల్ కాపీ సిద్ధం చేయాలి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయంలో గట్టి ప్లానింగ్‌తో ఉన్నట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ తన డేట్ ని పవన్ కళ్యాణ్ కోసం వదులుకుంటారా? లేక తన సినిమానే ఆ డేట్ కి తీసుకొస్తారా? అన్నది మరో రెండు వారాల్లో తేలిపోనుంది. ఒకవేళ పవన్ మార్చి 27న వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద పూనకాలు రావడం ఖాయం!

Similar Posts