సినిమా వార్తలు

పవర్‌ తుపానుకు సిద్ధంగా ఉండండి

స్టార్ హీరో , ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) గత కొంతకాలంగా తన సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అయితే ఒక్కసారిగా గేర్ మార్చి తన సినిమాల స్పీడు పెంచారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara VeeraMallu) షూటింగ్‌ పూర్తి కాగా, ఇందుకు సంబంధించిన డబ్బింగ్‌ను కూడా పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర టీమ్ అప్‌డేట్‌ను షేర్ చేసింది.

‘‘హరి హర వీరమల్లు’ డబ్బింగ్‌ను అన్‌స్టాపబుల్‌ ఫోకస్‌, ఫైర్‌తో పవన్‌కల్యాణ్‌ పూర్తి చేశారు. ఆయనకున్న బిజీ షెడ్యూల్‌ కారణంగా రాత్రి 10 గంటలకు డబ్బింగ్‌ మొదలవగా ఏకధాటిగా నాలుగు గంటల్లో పూర్తి చేశారు. పవర్‌ తుపానుకు సిద్ధంగా ఉండండి. జూన్‌ 12న మీ ఉత్తేజం ఉరకలేస్తుంది’ అని చిత్ర టీమ్ పేర్కొంది.

పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో పవన్‌కల్యాణ్‌ పోరాట యోధుడిగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు పూర్తయింది.

క్రిష్‌, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాబీ దేవోల్, అనుపమ్‌ ఖేర్, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తొలి భాగం ‘హరి హర వీరమల్లు: పార్ట్‌ 1- స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో విడుదల కానుంది.

Similar Posts