ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చింది ‘రాజాసాబ్‌’ టీజర్. ప్రభాస్‌ లుక్‌ మాస్‌ లెవెల్లో అదిరిపోయింది. విజువల్స్‌ మేకింగ్‌ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. దీంతో ఒక్క టీజర్‌తోనే సినిమా మీద నమ్మకాలు, అంచనాలు రెట్టింపు అయ్యాయి.

అయితే ఈ టీజర్ వేడుకలో దర్శకుడు మారుతి ఓ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని షేర్ చేశాడు. “సినిమా మూడున్నర గంటలు వస్తోంది” అని మొదట చెప్పి… తర్వాత “లేదు.. మూడు గంటలే” అని బలంగా సరిదిద్దుకున్నాడు. కానీ అప్పటికే టాక్ బయటకెళ్లిపోయింది.

ఇంతకీ అసలేం జరిగిందంటే – మారుతి ఇప్పటికే చాలా ఫుటేజ్‌ తీశాడు. రెడీగా ఉన్న కట్ మూడు గంటలు. ఇంకా కొన్ని సీన్లు, పాటలు మిగిలే ఉన్నాయి. దాంతో చివరికి మూడు గంటలకు మించడమే గ్యారంటీ. ఎంత కట్ చేసినా కుదిరేది లేదు!

ఇక్కడ twist ఇంకొకటి ఉంది – ఒక దశలో నిర్మాత “ఈ సినిమాని రెండు పార్టులుగా విడతీద్దామా?” అనే ఒక క్రేజీ ఐడియా తీసుకువచ్చాడు. కానీ మారుతి మాత్రం తేలికగా ఒప్పుకోలేదు. ఎందుకంటే అతని దగ్గర ఇప్పటికే రాజాసాబ్ 2 కు సంబంధించిన ప్లాన్ రెడీగా ఉంది.

పార్ట్ 2 అయితే మొత్తం డిఫరెంట్ ట్రీట్మెంట్ – హాలీవుడ్ స్కేలు అన్నమాట. ఇదే విషయాన్ని నిర్మాత విశ్వప్రసాద్ స్వయంగా క్లారిటీగా చెప్పారు. అంటే రాజాసాబ్‌ ఒక్క సినిమాతో కాదు… ఫ్రాంచైజీగా పేల్చే ప్రణాళిక already on!

డిసెంబరు 5న రాజాసాబ్ థియేటర్లలోకి దూసుకొస్తాడు. లెంగ్త్ ఎక్కువైనా, మాస్ బలాన్నే చూపించబోతున్నాడు ప్రభాస్!

, , , , ,
You may also like
Latest Posts from