సినిమా గాసిప్స్సినిమా వార్తలు

రష్మిక మందన్న ‘లెజ్బియన్’ అవతారం? విజయ్‌తో పెళ్లికి ముందే షాకింగ్ రూమర్స్ ,నిజమేనా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేయబోతున్న ఈ భామ, తన కెరీర్ విషయంలో తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది. బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ ‘కాక్ టెయిల్ 2’ (Cocktail 2) లో రష్మిక మందన్న ఒక ‘లెజ్బియన్’ (Lesbian) పాత్రలో నటించబోతోందన్న వార్త దావానంలా వ్యాపిస్తోంది.

కృతి సనన్‌తో రొమాన్స్.. షాహిద్ కపూర్‌తో ట్రయాంగిల్ లవ్!

2012లో వచ్చిన సూపర్ హిట్ ‘కాక్ టెయిల్’ కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, కృతి సనన్ మరియు షాహిద్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో లీక్ అయిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రష్మిక మరియు కృతి సనన్ ఒక కపుల్ గా కనిపించబోతున్నారట.

బీచ్ ఫొటోలు వైరల్: ఇటీవల విడుదలైన కొన్ని లొకేషన్ ఫొటోల్లో రష్మిక, కృతి అత్యంత సన్నిహితంగా కనిపించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.

బోల్డ్ అండ్ బ్యూటిఫుల్: మోడరన్ రిలేషన్ షిప్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రష్మిక మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత బోల్డ్ గా, పచ్చిగా కనిపించబోతోందని టాక్.

ఫ్యాన్స్ షాక్.. విజయ్ రియాక్షన్ ఏంటి?

ఒకవైపు పెళ్లి పనులతో బిజీగా ఉంటూనే, ఇలాంటి ప్రయోగాత్మక పాత్రకు రష్మిక ఓకే చెప్పడం చూస్తుంటే ఆమె డేరింగ్ ఏంటో అర్థమవుతోంది. అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం “మా నేషనల్ క్రష్ ఇలాంటి పాత్రలో నటించడం ఏంటి?” అంటూ పెదవి విరుస్తుంటే, మరికొందరు మాత్రం ఆమె నటనకు ఇదో పెద్ద పరీక్ష అని సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్ పాత్ర రష్మిక, కృతిల మధ్య ఎలా ఎంట్రీ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యిందని, త్వరలోనే ప్రమోషన్లు మొదలవుతాయని సమాచారం. అధికారికంగా చిత్ర బృందం స్పందించకపోయినా, ఈ ‘లెజ్బియన్’ రూమర్స్ మాత్రం కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే, రష్మిక మందన్న కెరీర్ లోనే ఇది అత్యంత హాట్ అండ్ బోల్డ్ ప్రాజెక్ట్ అవ్వడం ఖాయం. విజయ్‌తో పెళ్లి తర్వాత ఈ సినిమా రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి!

Similar Posts