
స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు? హీరోయిన్ ఎంట్రీపై అసలు నిజం ఇదీ! నోరు విప్పిన ఫైర్ బ్రాండ్!
టాలీవుడ్ సెన్సేషనల్ లేడీ, మాజీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజకీయాల్లో ఉన్నా, వెండితెరపై ఉన్నా ఆమె రూటే సెపరేటు. అయితే ఇప్పుడు రోజా కంటే ఆమె కూతురు అన్షు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అచ్చం రోజా ‘జెరాక్స్ కాపీ’లా ఉండే అన్షు.. త్వరలోనే వెండితెరపై మెరవబోతోందని, ఒక స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్లబోతోందని గత కొద్దిరోజులుగా వార్తలు షేక్ చేస్తున్నాయి.
స్టార్ హీరో కోడలిగా అన్షు? రోజా షాకింగ్ రియాక్షన్!
అన్షు ఒక స్టార్ హీరో కొడుకుతో పీకల్లోతు ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని జరుగుతున్న ప్రచారంపై రోజా తాజాగా స్పందించారు. ఈ వార్తలు విన్న రోజా తనదైన శైలిలో నవ్వుతూ కౌంటర్ ఇచ్చారు.
“నా కూతురు స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్తోందని నాకంటే మీకే ఎక్కువ తెలుస్తోంది. అసలు ఆ స్టార్ హీరో ఎవరో చెబితే నేను కూడా తెలుసుకుంటాను” అంటూ రూమర్లను తుత్తునియలు చేశారు.
హీరోయిన్ కాదా? సైంటిస్ట్ కాబోతోందా?
తల్లిని మించిన అందంతో మెరిసిపోయే అన్షు.. కచ్చితంగా హీరోయిన్ అవుతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ రోజా మాత్రం బాంబు పేల్చారు. అన్షుకు సినిమాలపై ఆసక్తి లేదని, ఆమె లక్ష్యం సైంటిస్ట్ కావడమని స్పష్టం చేశారు.
ప్రస్తుతం అన్షు అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసిస్తోంది.పరిశోధనల మీద ఆసక్తితో సైన్స్ వైపు అడుగులు వేస్తోంది. చదువుతో పాటు ఇటాలియన్ లాంగ్వేజ్‌లోనూ పట్టు సాధిస్తోంది.
నటన వరం.. కానీ ఆమె ఇష్టం!
“నటన అనేది ఒక వరం. భవిష్యత్తులో అన్షుకు నిజంగా సినిమాల్లోకి రావాలని అనిపిస్తే నేను కచ్చితంగా ప్రోత్సహిస్తాను. కానీ ఇప్పుడు మాత్రం ఆమె ఫోకస్ అంతా చదువు మీదనే ఉంది. నేను నా పిల్లలపై ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాను” అంటూ రోజా భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.
కేవలం చదువులోనే కాదు, పేద పిల్లలకు సాయం చేయడంలోనూ అన్షు తన తల్లి బాటలోనే నడుస్తోంది. అలాగే అన్షు గురించి వస్తున్న పెళ్లి, సినీ ఎంట్రీ వార్తలకు రోజా ఒక్క ఇంటర్వ్యూతో ఫుల్ స్టాప్ పెట్టేశారు.
