మెగా స్టార్ చిరంజీవి ‘విశ్వంభర’తో (Vishwambhara) సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. త్రిష (Trisha) హీరోయిన్. ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఆ స్దాయిలో బజ్ రావటం లేదు.
ఇక గతేడాది దసరా కానుకగా ‘విశ్వంభర’ టీజర్ విడుదల కాగా…ఓ మాదిరి రెస్పాన్స్ వచ్చింది. చాలా విమర్శలు అయితే వచ్చాయి. మరో ప్రక్క ఈ సినిమా ఓటిటి డీల్ అవ్వలేదంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం నిర్మాతలు చెప్పే రేట్లకు డిస్ట్రిబ్యూటర్స్ నెగోషియేట్ చేస్తున్నారని, అంత పెట్టి తీసుకుంటే రికవరీ లు అవ్వవని చెప్తున్నారు. అప్పటికీ విఎఫ్ ఎక్స్ కు బాగా ఖర్చు పెట్టాం..75 కోట్లు ఈ సినిమాపై మీడియాలో పీఆర్ చేస్తున్నా ఫలితం కనపడటం లేదు.
ముగింపు దశలో ఉన్న ఈ సినిమా జులై 24న థియేటర్లలోకి రానుంది. గతంలో ఇదే తేదీకి చిరు (Chiranjeevi) నుంచి ‘ఇంద్ర’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇది సెంటిమెంట్ పరంగానూ కలిసొచ్చే అవకాశం ఉండటంతో చిత్ర టీమ్ ఆ తేదీనే తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ రోజున ఓపినింగ్స్ ఎలా ఉంటాయి అనేదాని కన్నా చిరంజీవి సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది. పెట్టిన బడ్జెట్ కు ఎప్పటికి బ్రేక్ ఈవెన్ వస్తుందనేది కీలకం. దానిపైనే చిరంజీవి నెక్ట్స్ సినిమాల బడ్జెట్ లెక్కలు ఉంటాయనేది నిజం.
సోషియో ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమా.. చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది. దీనికి ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.