సినిమా వార్తలు

సాయి పల్లవి మిస్సింగ్? నేచురల్ బ్యూటీ సైలెంట్ వెనుక పెద్ద స్కెచ్చే ఉందా!

టాలీవుడ్‌లో నటనకు ప్రాణం పోసే నటీమణుల్లో సాయి పల్లవి రూటే సెపరేట్. ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే ఆ మ్యాజిక్కే వేరు. అయితే, గత కొద్దిరోజులుగా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒకటే చర్చ.. “సాయి పల్లవి ఏమైంది? ఎందుకు ఎక్కడా కనిపించడం లేదు?”. చైతూతో కలిసి నటించిన మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘తండేల్’ రిలీజ్ తర్వాత ఆమె పూర్తిగా సైలెంట్ అయిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

బాలీవుడ్ ప్రాజెక్టే కారణమా? లేక పర్సనల్ గ్యాపా?

సాయి పల్లవి మౌనం వెనుక ఒక భారీ స్కెచ్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఆమె ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఏకంగా రణబీర్ కపూర్ సరసన ‘రామాయణం’ సినిమాలో సీతమ్మగా నటిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఆమె తన లుక్‌ను మార్చుకుందా? అందుకే బయట ఎక్కడా కనిపించడం లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమా కంటే ముందు ఈమె మేరే రహో అని హిందీ సినిమాలో నటించింది. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్లోనే విడుదల కావాల్సి ఉండగా ఈ ఏడాది జూన్ 2026 కి వాయిదా పడింది. నిజానికి తండేల్ తర్వాత తెరపై కనిపించకుండా ప్రేక్షకులను, అభిమానులను నిరాశపరిచిన సాయి పల్లవి ఏడాది ఖచ్చితంగా తెరపై కనిపించి అలరిస్తుంది అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ నిరాశ తప్పలేదు..

డిసెంబర్లో విడుదల కావాల్సిన సినిమా కూడా సడన్ గా వాయిదా పడేసరికి సాయి పల్లవి ఎందుకు సైలెంట్ అయింది అనే కామెంట్లు వ్యక్తం అయ్యాయి. అయితే ఇలా సడన్గా ఈ సినిమా విడుదల కాకపోవడానికి కారణం పెద్ద సినిమాల సందడే అనే చెప్పాలి. గత ఏడాది డిసెంబర్లో బాలకృష్ణ అఖండ 2, అవతార్ యాష్ అండ్ ఫైర్, తూ మేరీ మైన్ తేరా మైన్ తేరా తూ మేరీ, ధురంధర్ వంటి చిత్రాల విడుదలే ఈ సినిమా వాయిదాకి కారణమని తెలుస్తోంది.

మరోవైపు, సాయి పల్లవి ఎప్పుడూ తన పర్సనల్ లైఫ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే షూటింగ్స్ లేని సమయంలో ఫ్యామిలీతో గడపడానికి వెళ్ళిపోయిందని కూడా కొందరు అంటున్నారు.

ఫ్యాన్స్ ఆందోళన.. క్లారిటీ వచ్చేది ఎప్పుడు?

ఏది ఏమైనా, తన ఫేవరెట్ హీరోయిన్ నుంచి చిన్న అప్‌డేట్ కూడా లేకపోవడంతో సాయి పల్లవి ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. కనీసం ‘రామాయణం’ ప్రమోషన్స్ మొదలైతే అయినా తమ ‘హైబ్రిడ్ పిల్ల’ను చూస్తామని ఆశగా ఎదురుచూస్తున్నారు. సాయి పల్లవి లాంటి క్రేజీ హీరోయిన్ ఇలా సైలెంట్ అవ్వడం అంటే బాక్సాఫీస్ దగ్గర ఏదో పెద్ద తుపానే రాబోతోందని అర్థం!

సాయి పల్లవి మౌనం ఎప్పుడూ ఒక సెన్సేషనే. ఆమె మళ్ళీ కెమెరా ముందుకు వస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘రామాయణం’ తో ఇండియా వైడ్‌గా సాయి పల్లవి జెండా పాతడం ఖాయమనిపిస్తోంది. అప్పటివరకు ఆమె ఫ్యాన్స్ వెయిటింగ్ తప్పదు!

Similar Posts