టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏం చేసినా అది సంచలనమే. నాగ చైతన్యతో విడాకుల తర్వాత తన లైఫ్ తనదే అన్నట్టుగా దూసుకుపోతున్న సామ్, గతేడాది డిసెంబర్ లో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును సీక్రెట్ గా పెళ్లాడి అందరికీ షాక్ ఇచ్చింది. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సమయంలో మొదలైన వీరి పరిచయం కాస్తా పెళ్లి పీటల వరకు వెళ్ళింది. అయితే తాజాగా తన రెండో భర్త రాజ్ నిడిమోరు గురించి సమంత పెట్టిన ఒక ఇన్ స్టా స్టోరీ ఇప్పుడు ఇంటర్నెట్ లో హీట్ పెంచుతోంది.

బెడ్ రూమ్ ఫోటో లీక్.. అడ్డంగా దొరికేసిన రాజ్!
సాధారణంగా సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ ని దాచాలని చూస్తారు, కానీ సమంత మాత్రం బెడ్ రూమ్ లో తన భర్త చేస్తున్న పనిని ఫోటో తీసి మరీ బయటపెట్టింది. ఆ ఫోటోలో రాజ్ నిడిమోరు బెడ్ మీద పిల్లో పట్టుకుని ఉండగా, నిద్రపోకుండా లాప్ టాప్ ముందు పెట్టుకుని చాలా సీరియస్ గా ఏదో వర్క్ చేస్తున్నాడు. దీనికి సమంత ‘పిల్లో హోర్డర్’ అని ట్యాగ్ ఇచ్చి ఒక ఫన్నీ కామెంట్ పెట్టింది.

ఫ్యాన్స్ రియాక్షన్.. వర్క్ మోజులో సామ్ ని మర్చిపోయాడా?
పెళ్ళైన కొత్తలోనే భర్త ఇలా బెడ్ రూమ్ లో కూడా పనిలో మునిగిపోవడంతో సమంత ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. “అర్ధరాత్రి కూడా పనేనా రాజ్ భయ్యా.. సామ్ ని అస్సలు పట్టించుకోవడం లేదుగా” అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం వీరి బాండింగ్ చూసి మురిసిపోతున్నారు. ఏది ఏమైనా సమంత షేర్ చేసిన ఈ బెడ్ రూమ్ పిక్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వర్క్ ప్రెజర్ వల్ల సమంతను రాజ్ నిడిమోరు వెయిటింగ్ లో పెడుతున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

