తెలుగులో శేఖర్ కమ్ముల “కుబేరా” సాలీడ్ హిట్. ధనుష్, నాగార్జున కాంబినేషన్‌తో వచ్చిన ఈ సినిమా తొలి వీకెండ్‌లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తోంది. మార్నింగ్ షోకే హిట్ టాక్ రావటం కలిసొచ్చింది . థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు… ఓటీటీల దృష్టిని ఆకర్షించే కలెక్షన్లు. కానీ ఇదే సినిమా తమిళంలో ఫెయిలైంది. ఇక హిందీలో అయితే… ఎవరూ ఊహించని విధంగా పూర్తిగా తేలిపోయింది!
పూర్తి వివరాల్లోకి వెళితే…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున హీరోలుగా రూపొందిన “కుబేరా” తెలుగు బాక్సాఫీస్ దగ్గర కలకలం సృష్టిస్తోంది. ఫస్ట్ వీకెండ్ నుంచే సూపర్ రన్ కొనసాగిస్తూ వంద కోట్ల క్లబ్‌ను టచ్ చేసే దిశగా ముందుకెళ్తోంది. కానీ అదే సినిమా తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయికి వెళ్లలేక పోయింది.
ఇంతకీ అసలు షాక్ ఇచ్చింది హిందీ వెర్షన్. రిలీజ్‌కు ముందు ధనుష్, నాగార్జున, రష్మిక… వీరంతా కలిసి పాన్ ఇండియా బిజినెస్ చేస్తారనుకున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌తో సినిమాకు మంచి బజ్ వచ్చింది. అయితే హిందీలో కుబేరా పూర్తిగా నిరుత్సాహపరిచింది. రిలీజ్ అయ్యి ఐదు రోజులు కావొచ్చేసరికి… మొత్తంగా కేవలం రూ.1.25 కోట్లు నెట్ కలెక్షన్ మాత్రమే వచ్చింది.
ఇదే సమయంలో ఆమిర్ ఖాన్ నటించిన “సితారే జమీన్ పర్” కూడా విడుదల కావడం, హిందీ ఆడియెన్స్ ఫోకస్ పూర్తిగా ఆ సినిమాపైనే ఉండిపోవడం వల్ల కుబేరా నార్త్ లో మినిమం బజ్ క్రియేట్ చేయలేకపోయింది.