టాలీవుడ్‌లో ఒకప్పుడు లవర్ బాయ్‌గా వెలిగిపోయిన హీరో ఆకాష్ గుర్తున్నాడా? ‘ఆనందం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ నటుడు, ఇప్పుడు కమెడియన్ సునీల్‌పై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కార్చిచ్చు రేపుతున్నాయి. తన కెరీర్‌ను పణంగా పెట్టి సహాయం చేస్తే, సునీల్ తనను దారుణంగా మోసం చేశాడని ఆకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది? ఆకాష్ కెరీర్ దెబ్బతినడానికి సునీల్ ఎలా కారణమయ్యారు? అనే విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

తమిళ సినిమాను వదులుకుని వస్తే.. మొండిచేయి!
సునీల్ హీరోగా మారిన తొలి సినిమా ‘అందాల రాముడు’ కోసం ఆకాష్ తన ప్రాణంగా భావించే తమిళ ప్రాజెక్టును వదులుకున్నారు. విజయ్ కాంత్ సినిమా డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాలో ఆకాష్ హీరోగా నటిస్తుండగా, సునీల్ ఫోన్ చేసి బతిమాలడంతో స్నేహం కోసం ఇక్కడికి వచ్చారు. “భయ్యా నువ్వు అందంగా ఉంటావు, అందుకే ఈ క్యారెక్టర్ నువ్వే చేయాలి” అని సునీల్ నమ్మబలికారని ఆకాష్ గుర్తు చేసుకున్నారు. కానీ సినిమా హిట్ అయ్యాక సునీల్ ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి ఆకాష్ షాక్ అయ్యారు. ఒక్క ఇంటర్వ్యూలో కూడా ఆకాష్ పేరు చెప్పకపోగా, కనీసం పోస్టర్ల మీద కూడా ఆయన ఫోటో లేకుండా జాగ్రత్త పడ్డారట.

క్యారెక్టర్‌ను తొక్కేశారు.. డైరెక్టర్ అసలు నిజం!
నిజానికి తమిళ ఒరిజినల్ సినిమాలో ఆకాష్ చేసిన పాత్రకు ఒక సాంగ్ ఉంటుంది, కానీ తెలుగులో దాన్ని కావాలనే తొలగించారని ఆకాష్ ఆరోపించారు. దీనిపై దర్శకుడిని నిలదీయగా.. “ఏం చేయను బాబు, సునీలే వద్దన్నాడు” అని చెప్పడంతో ఆకాష్ మైండ్ బ్లాక్ అయిందట. షూటింగ్ సమయంలో తన చేతులు పట్టుకుని “నిన్ను జీవితాంతం మర్చిపోను భయ్యా” అన్న సునీల్, సక్సెస్ వచ్చాక కృతజ్ఞత లేకుండా వ్యవహరించడం ఆకాష్‌ను తీవ్రంగా కలచివేసింది.

అనవసరంగా సహాయం చేశానా?
కేవలం సునీల్ మాత్రమే కాదు, శ్రీను వైట్ల వంటి పెద్ద డైరెక్టర్ల కోసం కూడా తాను రూపాయి తీసుకోకుండా పనిచేశానని ఆకాష్ వెల్లడించారు. తనను ‘లక్కీ మస్కట్’ అని పిలుస్తూ వాడుకున్నారే తప్ప, తన కెరీర్‌కు ఎవరూ అండగా నిలబడలేదని ఆయన వాపోయారు. ఒకప్పుడు సునీల్ తన సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు చేసేవాడని, కానీ తర్వాతి కాలంలో తననే చిన్నచూపు చూడటం తట్టుకోలేకపోయానని ఆకాష్ ఎమోషనల్ అయ్యారు.
సినీ గ్లామర్ వెనుక ఉన్న ఇలాంటి చీకటి కోణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆకాష్ చేసిన ఈ తీవ్ర ఆరోపణలపై సునీల్ ఎలా స్పందిస్తారో చూడాలి!

