
వంటలక్క ఆస్తులు తెలిస్తే కళ్లు తిరగాల్సిందే! రోజుకు లక్షల్లో సంపాదన.. ప్రేమీ విశ్వనాథ్ వెనుక ఇంత కథ ఉందా?
తెలుగు బుల్లితెరపై ఏ హీరోయిన్‌కు లేనంత క్రేజ్ సంపాదించుకుంది ‘వంటలక్క’ అలియాస్ ప్రేమీ విశ్వనాథ్. ‘కార్తీక దీపం’ సీరియల్‌తో ఇంటింటి ఆడపడుచుగా మారిన ఆమె.. ఇప్పుడు పార్ట్-2 (నవ వసంతం) తో మళ్ళీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే తెరపై ఎంతో అమాయకంగా కనిపించే దీపమ్మ.. నిజ జీవితంలో మాత్రం కోట్లకు అధిపతి అని మీకు తెలుసా?
రోజుకు లక్ష రూపాయల రెమ్యునరేషన్!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని ఇమేజ్ ఉన్న ప్రేమీ విశ్వనాథ్.. రెమ్యునరేషన్ విషయంలోనూ రికార్డులు సృష్టిస్తోంది. కెరీర్ మొదట్లో రోజుకు రూ. 25 వేలు అందుకున్న ఆమె, ఇప్పుడు ‘కార్తీక దీపం 2’ కోసం రోజుకు సుమారు రూ. 1 లక్ష వసూలు చేస్తున్నట్లు టాక్. అంటే నెలకు దాదాపు రూ. 30 లక్షలకు పైగానే సంపాదిస్తోందన్నమాట!
రూ. 50 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్లు!
మీడియా వర్గాల సమాచారం ప్రకారం ప్రేమీ విశ్వనాథ్‌కు దాదాపు రూ. 50 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కేరళలో విలాసవంతమైన భవనంతో పాటు రెండు లగ్జరీ కార్లు కూడా ఆమె సొంతం. కేవలం నటిగానే కాకుండా, ఆమె ఒక ప్రొఫెషనల్ లా ప్రాక్టీషనర్ కూడా! అంతేకాదు, కేరళలో ఆమెకు రెండు సొంత షూటింగ్ స్టూడియోలు ఉన్నాయి. మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అక్కడే జరుగుతుంటాయి.
వంటలక్క ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్:
భర్త సెలబ్రిటీ ఆస్ట్రాలజర్! ప్రేమీ విశ్వనాథ్ వ్యక్తిగత జీవితం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆమె భర్త డాక్టర్ వినీత్ భట్ ప్రముఖ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్. ఆయన 2017లో ‘వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్’ అవార్డును కూడా అందుకున్నారు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు, ప్రస్తుతం అతను బీటెక్ చదువుతున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అతని ఫోటోలు చూసి, ఫ్యూచర్ హీరో మెటీరియల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి అటు సంపాదనలో, ఇటు చదువులో, బిజినెస్‌లో వంటలక్క నిజంగానే ఆల్ రౌండర్ అని నిరూపించుకుంది.
