జాతిపిత మహాత్మా గాంధీపై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి, శ్రీకాంత్ భరత్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

మీడియాతో మాట్లాడిన వెంకట్ బల్మూరి,

“వాక్ స్వాతంత్ర్యం పేరుతో కొందరు హద్దులు మీరుతున్నారు. గాడ్సే వారసులమని చెప్పుకునే వాళ్లు గాంధీజీపై ఇలాంటి మాటలు మాట్లాడడం అసహ్యకరమైంది,” అని తీవ్రంగా విమర్శించారు.

అంతేకాక, సినీ పరిశ్రమ పెద్దలు కూడా ఈ ఘటనపై స్పందించాలని, ఇటువంటి వ్యాఖ్యలపై మౌనం వహించకూడదని ఆయన హెచ్చరించారు. త్వరలోనే ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును కలసి, శ్రీకాంత్ భరత్ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరతామని తెలిపారు.

క్షమాపణ వీడియో

జాతిపిత మహాత్మా గాంధీపై సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో, ఆయన బహిరంగంగా క్షమాపణలు తెలుపుతూ ఒక వీడియోను విడుదల చేశారు.

కొన్ని రోజుల క్రితం తాను పెట్టిన పోస్టుల వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకు పూర్తి బాధ్యత వహిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అందరినీ తల వంచి క్షమించమని కోరుతున్నట్లు ఆ వీడియోలో శ్రీకాంత్ అయ్యంగార్ తెలిపారు.

ఈ వివాదం నేపథ్యంలో, సోషల్ మీడియాలో కూడా భారీ చర్చ మొదలైంది. కొంతమంది శ్రీకాంత్ భరత్ వ్యాఖ్యలను అసహనంగా విమర్శిస్తుండగా, మరికొందరు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు – పోలీసులు తీసుకునే చర్యలపై కేంద్రీకృతమైంది. ఒకవైపు పోలీసులకు, మరోవైపు ‘మా’కు ఫిర్యాదులు అందడం, విమర్శలు తీవ్రతరం కావడంతోనే శ్రీకాంత్ అయ్యంగార్ దిగివచ్చి క్షమాపణ చెప్పినట్లు స్పష్టమవుతోంది.

, , , , ,
You may also like
Latest Posts from ChalanaChitram.com