పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా అంటేనే ఒక వైబ్రేషన్. ఇప్పుడు అదే వైబ్రేషన్‌ను ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీల ఎక్స్ పీరియన్స్ చేస్తోంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో పవన్ పక్కన ఆడిపాడుతున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా తన పర్సనల్ మెమొరీస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు అదిరిపోయే కిక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్‌ను మొదటిసారి వెండితెరపై చూసినప్పటి విశేషాలను చెబుతూ అందరినీ సర్ ప్రైజ్ చేసింది.

వివరాల్లోకి వెళితే..
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీలీల మాట్లాడుతూ.. తాను చిన్నప్పుడు చూసిన మొట్టమొదటి పవన్ కళ్యాణ్ సినిమా ‘ఖుషి’ అని వెల్లడించింది. అయితే ఆమెకు బాగా గుర్తున్న సీన్స్ మాత్రం ‘జల్సా’ సినిమాలోనివట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఇలియానా మధ్య వచ్చే ఆ ఫన్నీ సంభాషణలు, పవన్ మేనరిజమ్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.

అప్పట్లో థియేటర్లో చూసిన హీరో పక్కనే ఇప్పుడు హీరోయిన్‌గా నటించడం ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అని మురిసిపోతోంది. ఈ ఎక్స్ పీరియన్స్ తన కెరీర్‌లో మోస్ట్ స్పెషల్ అని, సెట్స్‌లో పవన్ ఎనర్జీ చూసి మైండ్ బ్లాక్ అయిందని తన ఆనందాన్ని పంచుకుంది.

