సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను బేధభావం లేకుండా, నిర్మొహమాటంగా పంచుకునే వ్యక్తిత్వం ఉన్న నటి రేణు దేశాయ్. తాజాగా మరో కీలకమైన సందేశంతో ఆమె ముందుకొచ్చారు. ఈసారి ఆమె చెప్తున్న విషయం — చైనా ఉత్పత్తుల వాడకాన్ని మానేయాలి అని!

సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.

అందులో రేణు దేశాయ్ చెప్పినదేమిటంటే:

“దేశ భద్రత, మన కుటుంబ భద్రత ముఖ్యం అనుకుంటే – ఇకపై చైనాలో తయారైన చిన్న వస్తువైనా కొనకుండా ఉండాలి.” . “లేబుల్ చదవడం మొదలుపెట్టండి!”

ప్రతీ ఉత్పత్తి కొనేముందు, దాని పై ఉన్న లేబుల్ చదవాలని ఆమె సూచించారు. చైనాలో తయారయినదైతే – దాన్ని కొనకుండా ఉండటమే మన దేశాన్ని ఆదుకోవడంలో మొదటి అడుగు అని స్పష్టం చేశారు.

తాను కూడా గతంలో చైనా వస్తువులు కొన్నానని కానీ ఇప్పుడు ఏ వస్తువు అయినా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. “ఇది ఒక్క రోజులో మారే విషయం కాదు. కానీ ఎక్కడో ఒకచోట మొదలు పెట్టాల్సిందే” అంటూ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.

“మన దేశాన్ని మనమే ఆదుకోకపోతే – ఇంకెవరు చేస్తారు?” . “అర్థం లేని రియాలిటీ షోల మీద కాకుండా… అనవసరమైన గాసిప్‌ల మీద కాకుండా… మన దేశ భవిష్యత్తుపై మాట్లాడటం, ఆలోచించడం మొదలు పెట్టండి” అని ఆమె చెప్పారు.

ఈ సందేశాన్ని ప్రతీ ఒక్కరూ తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దేశభక్తి నినాదాల కంటే, ఈ చిన్నచిన్న చర్యలే నిజమైన దేశ ప్రేమ అని ఆమె సూచన.

“చైనా ఉత్పత్తుల మానేయడం అనేది ఉద్యమం కాదు, మన కర్తవ్యంలా తీసుకోవాలి” – ఇది ఇప్పుడు రేణు దేశాయ్ పిలుపు.

You may also like
Latest Posts from