శంకర్ దర్శకత్వంలో దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా 2025 డిజాస్టర్ అయ్యింది. నిర్మాతకు భారీ నష్టాలు మిగిల్చింది. శంకర్ ని అందరూ విమర్శస్తున్నారు. అయితే కొద్దిలో కొద్ది ఊరట ఏమిటంటే అప్పన్న పాత్రలో చరణ్ నటన బాగుందని ప్రశంసలు రావటమే. ఈ క్రమంలో ప్రస్తుతం అందరి దృష్టి బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌సీ16 సినిమాపై ఉంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది..ఈ యేడేదే వస్తుందా అనే డిస్కషన్ మొదలైంది.

RC16 సినిమాను ఇదే సంవత్సరమే విడుదల చేయడం ద్వారా గేమ్‌ ఛేంజర్‌ డ్యామేజ్‌ని తగ్గించాలని మెగా కాంపౌండ్ భావిస్తోంది. అందుకే బుచ్చిబాబుకి ఈ ఏడాదిలోనే సినిమా విడుదల చేసే విధంగా షూటింగ్‌ ముగించాలని మెగా కాంపౌండ్‌ నుంచి రిక్వెస్ట్‌ వచ్చిందని మీడియా వర్గాల్లో వినిపిస్తోంది.

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని ఆగస్టు వరకు సినిమా షూటింగ్‌ పూర్తి చేసి దసరా లేదా దీపావళి కానుకగా సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇదే ఏడాదిలో RC16 సినిమాని విడుదల చేస్తే కచ్చితంగా మెగా ఫ్యాన్స్‌ ఖుషీ అవుతారనేది నిజం.

ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్న విషయం తెల్సిందే.

స్పోర్ట్స్ డ్రామాగా పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది.

, , ,
You may also like
Latest Posts from