
‘న్యూడ్ సీన్’ చేయాలని వేధించాడు.. డైరెక్టర్ పై కోర్టుకు ఎక్కిన స్టార్ హీరోయిన్!
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ బ్లేక్ లైవ్లీ (Blake Lively), డైరెక్టర్ జస్టిన్ బాల్డోని మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. ‘ఇట్ ఎండ్స్ విత్ అస్’ (It Ends With Us) సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ తనను తీవ్రంగా వేధించాడని, చివరికి నగ్నంగా నటించాలని బలవంతం చేశాడని బ్లేక్ లైవ్లీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంలో తాజాగా బయటకు వచ్చిన కొన్ని ఆధారాలు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.
ఆ సీన్ కోసం అంత ఒత్తిడా?
బ్లేక్ లైవ్లీ వేసిన దావా ప్రకారం.. సినిమాలో ఒక సీన్ కోసం ఆమెను న్యూడ్‌గా నటించాలని డైరెక్టర్ జస్టిన్ , ప్రొడ్యూసర్ జేమీ హీత్ తీవ్రంగా ఒత్తిడి తెచ్చారట. దానికి జస్టిన్ చెప్పిన కారణం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే! “మా ఆవిడ పిల్లలకు జన్మనిచ్చేటప్పుడు తన బట్టలు తనే చింపేసుకుంది.. నువ్వు కూడా ఈ సీన్‌లో అలాగే చేయాలి” అంటూ వింత లాజిక్ తీశారట. దీనికి బ్లేక్ గట్టిగా బదులిస్తూ.. “నేను కూడా పిల్లలకు జన్మనిచ్చాను, కానీ అప్పుడు నేను బట్టలతోనే ఉన్నాను” అంటూ కౌంటర్ ఇచ్చిందట.
ఆయనొక ఫేక్ ఫెమినిస్ట్.. తోటి నటి ఫైర్!
కేవలం బ్లేక్ మాత్రమే కాదు, ఆ సినిమాలో నటించిన మరో నటి జెన్నీ స్లేట్ (Jenny Slate) కూడా డైరెక్టర్ జస్టిన్ గురించి దారుణమైన విషయాలు బయటపెట్టింది.
పెద్ద ఫ్రాడ్: “జస్టిన్ బయట తనను తాను మహిళా పక్షపాతిగా (Male Feminist) చెప్పుకుంటాడు కానీ, నిజానికి ఆయనొక పెద్ద ఫ్రాడ్” అని జెన్నీ మండిపడింది.
నార్సిసిస్ట్: “నా కెరీర్‌లో ఇలాంటి వింత మనిషిని నేను చూడలేదు. ఆయనొక పెద్ద క్లౌన్, నార్సిసిస్ట్. తనతో పని చేయడం చాలా ఇబ్బందిగా ఉంది” అంటూ తన ఆవేదనను టెక్స్ట్ మెసేజ్‌ల రూపంలో వెళ్లగక్కింది.
భారీ నష్టపరిహారం.. 1300 కోట్ల దావా!
డైరెక్టర్ ప్రవర్తన వల్ల తాను లైంగిక వేధింపులకు గురయ్యానని, తనను టార్గెట్ చేశారని బ్లేక్ లైవ్లీ ఏకంగా 161 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1350 కోట్లు పైన) నష్టపరిహారం కోరుతూ కోర్టులో కేసు వేసింది. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు కేవలం హీరోయిన్లే కాదు, ఆ నవల రచయిత్రి కొలీన్ హూవర్ కూడా జస్టిన్ ఉండటం వల్ల తాను అసౌకర్యంగా ఫీలయ్యానని పేర్కొనడం గమనార్హం.
బయట నీతులు చెప్తూ.. లోపల హీరోయిన్లను ఇబ్బంది పెట్టే ఇలాంటి డైరెక్టర్ల అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. కోర్టులో బయటపడిన ఈ ఆధారాలు జస్టిన్ బాల్డోని కెరీర్‌ను ప్రమాదంలో పడేసేలా ఉన్నాయి. మరి ఈ 1300 కోట్ల దావా ఎటు తిరుగుతుందో.. హాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి!
మీరేమంటారు? సీన్ పేరుతో హీరోయిన్లను ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా? కింద కామెంట్ చేయండి!
