హైదరాబాద్‌లో ఇన్‌కం ట్యాక్స్ దాడులు రెండోరోజైన బుధవారం కొనసాగుతూ సినిమా వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తన్నాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా పెట్టుబడులపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
అల్లు అర్జున్ సూపర్ హిట్ పుష్ప-2 సినిమాకు పెట్టిన బడ్జెట్.. వచ్చిన ఆదాయంపై అధికారులు ఎంతో తెలుసుకునే పనిలో పడ్డారు. ఆయా సంస్థలు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో ఐటీ అధికారుల రెండోరోజు సైతం తనిఖీలు చేపడుతున్నారు.
ఈ క్రమంలో ఇవాళ ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
సుకుమార్ నివాసంలో బుధవారం తెల్లవారుజామున ఐటీ అధికారులు సోదాలు చేశారు.
మరోవైపు ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఇళ్లు, ఆఫీసులోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
అలాగే మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయం, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ నివాసాలు, మ్యాంగో మీడియా సంస్థ, సత్య రంగయ్య ఫైనాన్స్, నిర్మాత అభిషేక్ అగర్వాల్‌తో పాటు ఇతర ఫైనాన్స్ కంపెనీలలోనూ ఐటీ శాఖ అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి.
ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.