వాడివాసల్… తమిళ కల! కానీ ఇప్పుడది మాయం అయ్యిందా? జల్లికట్టు అంటే తమిళుల గర్వం. ఆ పైన వెట్రిమారన్ దర్శకత్వం,
ఆపైన సూర్య డబుల్ రోల్! ఈ మూడు కలవడం అంటే తమిళ సినీ చరిత్రలోనే ఒక అద్బుత ఘట్టం రాయాల్సిందే. అలాంటి ఘట్టమే మొదలవ్వాల్సిన సమయానికి వచ్చి, ఇప్పుడు… వాయిదా పడిందని కాకుండా, సరిగ్గా చెప్పాలంటే ఆగిపోయిందని వినిపిస్తోంది.

ప్రముఖ తమిళ దర్శకుడటు వెట్రిమారన్ డైరెక్షన్‌లో జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కే ఈ కథలో సూర్య తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తాడనేది ఈ ప్రాజెక్టుకు హైప్ ఇచ్చే పాయింట్. గద్దెపై మనుషుల మద్దతుకంటే, పోరుబలమే ఆఖరికి గెలిపిస్తుందనేది ఈ కథలో అండర్‌టోన్. ఇది కేవలం జల్లికట్టు ఆట గురించే కాదు… అది ఒక ప్రజల పోరాట చిహ్నం.

ఈ సినిమా కోసం సూర్య ఇప్పటికే మూడు సంవత్సరాలుగా వెట్రిమారన్‌ని ఎదురుచూస్తున్నాడు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం — దర్శకుడు ఇంకా ఫైనల్ బౌండరీ స్క్రిప్ట్ తెచ్చి ఇవ్వలేదట. దీంతో చివరకు సూర్య ఓపిక కోల్పోయి ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్.

సూర్య ఈ మధ్యకాలంలో చేసిన భారీ ప్రాజెక్టుల ప్లాఫ్ అవ్వటమే ఇందుకు కారణం అంటున్నారు.

  1. కంగువ (Kanguva):
    పాన్ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ, ఈ సినిమా ఫలితంగా మాత్రం డీలా పడిపోయింది.
  2. రెట్రో:
    కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా తమిళంలో పర్వాలేదనిపించుకుంది కానీ తెలుగు ప్రేక్షకుల్లో అసలు స్పందన కనిపించలేదు.

ప్రస్తుతం..

సూర్య తాజా సినిమా – వెంకీ అట్లూరితో:

ప్రస్తుతం సూర్య తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తయి, షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాపైనే ఇప్పుడు సూర్య ఆశలు పెట్టుకున్నాడు.

వాడివాసల్‌కి రీప్లేస్ ఎవరు?

ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే — వాడివాసల్ కథకు సూర్య తప్పితే… ఆ స్థాయిలో నటించి, అంత భావోద్వేగాన్ని మోసే హీరో ఇంకెవరు? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద సమస్యగా మారింది.

, ,
You may also like
Latest Posts from