బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్టులపై వచ్చిన రూమర్స్ కు, వార్తలకు ఈసారి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి ఒక భారీ సూపర్ హీరో సినిమా చేయనున్నట్లు అఫీషియల్ గా వెల్లడించారు. ఇది ఆమిర్ ఖాన్ కెరీర్‌లో తొలిసారి సూపర్ హీరో పాత్రగా ఉండబోతున్నదని తెలుస్తోంది.

తాజాగా ఈ నెల 20న థియేటర్లలో రిలీజ్ కానున్న ‘సితారే జమీన్ పర్’ ప్రమోషన్‌లో పాల్గొన్న ఆయన, గత కాలంగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న ‘పీకే’ సీక్వెల్, దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ వంటి వార్తలను స్పష్టంగా ఖండించారు.

“నేను, లోకేష్ కలిసి ఓ సూపర్ హీరో కథపై పనిచేస్తున్నాం. ఇది భారీ యాక్షన్, భారీ బడ్జెట్ సినిమా. 2026 మధ్యలో షూటింగ్ మొదలవుతుంది” అని చెప్పారు.

తమిళ బ్లాక్‌బస్టర్ హిట్‌లతో ప్రపంచం ముందు పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సూపర్ హీరో సినిమా, భారతీయ ప్రేక్షకులకు కొత్త ప్రమాణాలు సృష్టించే అంచనాలతో తయారవుతోంది. ఆమిర్ ఖాన్ సెలక్షన్ పై ఇన్నేళ్లుగా నమ్మకం పెరిగింది. ఇక లోకేష్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ లో తనదైన శైలిని చాటి చెబుతూ ఈ సంయుక్త ప్రయత్నం భారీ విజయం కావచ్చునని భావిస్తున్నారు.

#Aamir Khan, #Lokesh Kanagaraj, #Sitaare Zameen Par

By admin