సినిమా వార్తలు

The Raja Saab: రాజా సాబ్ గుట్టు రట్టు.. ప్రభాస్‌నే కాదు ఆ హీరోయిన్‌ను కూడా మోసం చేశారా? డూప్ ఫోటోలు లీక్ చేసిన విలన్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా, థియేటర్లలో కంటే ఓటీటీలోకి వచ్చిన తర్వాతే నెటిజన్లకు అసలైన టార్గెట్‌గా మారింది. మారుతి మేకింగ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్, సినిమాలో ఉన్న తప్పులను వెతికి మరీ స్క్రీన్ షాట్లతో ఏకిపారేస్తున్నారు.

మారుతికి ‘క్యాష్ ఆన్ డెలివరీ’ టార్చర్!

సినిమా ఫలితంపై ఆగ్రహంతో ఉన్న ఫ్యాన్స్, దర్శకుడు మారుతిని వ్యక్తిగతంగా వేధిస్తున్నారనే వార్తలు షాక్ ఇస్తున్నాయి. మారుతి ఇంటికి వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పంపిస్తూ నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. ఒకానొక దశలో ఆయన బయటకు రావడమే మానేసినా, ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత మళ్ళీ ట్రోలింగ్ సెగలు మొదలయ్యాయి.

ప్రభాస్ లుక్‌లో గందరగోళం.. వీఎఫ్ఎక్స్ లోపాలు!

సినిమాలో ప్రభాస్ గడ్డం ఉన్న సీన్లు, మరుక్షణమే గడ్డం లేని సీన్లు రావడం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇక బాడీ డబుల్ (Body Double) వాడకం అయితే క్లియర్ గా తెలిసిపోవడంతో, మారుతి అస్సలు కేర్ తీసుకోలేదా? అని ప్రశ్నిస్తున్నారు. కథలో లాజిక్ లేకపోవడం ఒకెత్తయితే, ఈ టెక్నికల్ లోపాలు ఇప్పుడు సినిమాకు పెద్ద మైనస్‌గా మారాయి.

ట్విస్ట్ ఇచ్చిన విలన్.. హీరోయిన్ కూడా డూపే!

తాజాగా ఈ సినిమాలో విలన్ గ్యాంగ్‌లో నటించిన రోన్సన్ విన్సెంట్ చేసిన ఒక పోస్ట్ పెను సంచలనంగా మారింది. ప్రభాస్ కే కాకుండా, హీరోయిన్ మాళవిక మోహనన్ కు కూడా డూప్‌ను వాడేశారనే నిజాన్ని ఆయన బయటపెట్టేశాడు. “పెద్ద హీరోలు, హీరోయిన్లతో ఫోటోలు దిగడం కష్టం కాబట్టి, వారి డూప్‌లతో ఫోటోలు దిగి సరిపెట్టుకుంటాను” అంటూ డూప్ హీరోయిన్‌తో దిగిన ఫోటోను షేర్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ మళ్ళీ రెచ్చిపోతున్నారు. “ఆఖరికి హీరోయిన్‌కు కూడా డూప్‌నా బాస్?” అంటూ మారుతిపై సెటైర్లు వేస్తున్నారు.

Similar Posts