సినిమా వార్తలు

చైల్డ్ ఆర్టిస్ట్‌గా చూశాం.. ఇప్పుడు గ్లామర్ బాంబ్ లా పేలింది! షేక్ చేస్తున్న ధురంధర్ బ్యూటీ పిక్స్!

ఒకప్పుడు తన బుజ్జి బుజ్జి మాటలతో, అద్భుతమైన నటనతో మెప్పించిన ఆ చిన్నారి.. ఇప్పుడు ఒక్కసారిగా ‘గ్లామర్ డోస్’ పెంచి అందరికీ పిచ్చెక్కిస్తోంది. ఆమె మరెవరో కాదు, ‘నాన్న’ సినిమాలో చిట్టి పాపగా కనిపించిన సారా అర్జున్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

చిన్నారి పాప.. గ్లామర్ పాప అయిపోయింది!

విక్రమ్ ‘నాన్న’ సినిమాలో నటించిన ఆ చిన్నారి సారా అర్జున్ గుర్తుందిగా? ఇప్పుడు ఏకంగా రణవీర్ సింగ్ మూవీ ‘ధురంధర్’లో తన గ్లామర్ తో మెప్పించి పాన్ ఇండియా స్టార్ అయిపోయింది.

ధురంధర్ బాక్సాఫీస్ సునామీ!

సారా అర్జున్ నటించిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. 35వ రోజు కూడా రూ.4.25 కోట్లు రాబట్టి, ఇండియాలో రూ.790.25 కోట్ల మైలురాయిని చేరుకుంది.

రూ. 1200 కోట్ల క్లబ్ లో సారా!
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ.1,233 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఒక్క సినిమాతో సారా అర్జున్ రేంజ్ మారిపోయింది.

మెరూన్ రెడ్ గౌనులో మంటలు పుట్టిస్తోంది!
తాజాగా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. మెరూన్ రెడ్ కలర్ గౌనులో తన అందాలను ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న ధురంధర్ బ్యూటీ!

ఇన్నాళ్లు చిన్న పిల్లలా కనిపించిన సారా, ఇప్పుడు ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచి అభిమానులకి హీట్ పుట్టిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.

పొన్నియన్ సెల్వన్ లో ఐశ్వర్య రాయ్ చిన్నప్పటి పాత్రలో..
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’లో ఐశ్వర్య రాయ్ చిన్నప్పటి పాత్రలో సారా అర్జున్ నటించి అందరినీ మెప్పించింది.

తెలుగు సినిమా ‘యుఫోరియా’లో హీరోయిన్ గా..
సారా అర్జున్ ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ‘యుఫోరియా’ అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. ఇది ఈ ఏడాది ఫిబ్రవరి 6న విడుదల కానుంది.

రాజేంద్రప్రసాద్ మనవరాలిగా ‘దాగుడుమూతల దండాకోర్’ లో..
2015లో వచ్చిన ‘దాగుడుమూతల దండాకోర్’ సినిమాలో రాజేంద్రప్రసాద్ మనవరాలిగా నటించి తెలుగు ప్రేక్షకులకి అప్పట్లోనే దగ్గరైంది.

వరుస ఆఫర్లతో దశ తిరగబోతోంది!

ఒకవైపు ధురంధర్ కలెక్షన్ల వర్షం కురిపిస్తుండగా, మరోవైపు కొత్త ప్రాజెక్టులు క్యూ కడుతుండడంతో నెటిజన్లు సారా అర్జున్ దశ తిరగబోతోందని కామెంట్ చేస్తున్నారు.

స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవాలని ఫ్యాన్స్ ఆకాంక్ష!
బాలనటిగా మొదలై ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన సారా అర్జున్.. మరిన్ని అవకాశాలు అందుకుని ఇండస్ట్రీని ఏలాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Similar Posts