కమల్ హాసన్ – మణిరత్నం కాంబినేషన్ అంటేనే పెద్ద సంచలనం. ఇద్దరి లెజెండరీల కలయిక. ఈ నేపధ్యంలో గ్రాండ్ గా రూపొందించిన ‘థగ్ లైఫ్’ ట్రైలర్‌, పాటలతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇండస్ట్రీలో కమల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ వస్తుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

కానీ…షాకింగ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం వెనకబడి ఉన్నాయి.

థగ్ లైఫ్ బుకింగ్స్: భారీ అంచనాలకు బాగా దూరంగా

తమిళనాడు లో కేవలం రూ.15 కోట్లు ఓపెనింగ్ బిజినెస్ బుకింగ్స్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.

ఇది కమల్ ‘విక్రమ్’ (రూ.20 కోట్లకు పైగా ఓపెనింగ్)తో పోలిస్తే చాలా తక్కువ.

తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ స్లో ట్రెండ్ చూపిస్తున్నాయి.

కర్ణాటకలో నిషేధం వలన మల్టిప్లెక్స్ ఓపెనింగ్స్‌లో డామేజ్ స్పష్టంగా కనిపిస్తోంది.

విదేశాల్లో మెరుగైన పరిస్దితి… కానీ ఆ కూడా సరిపోదు

ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటికే $1 మిలియన్ అడ్వాన్స్ బుకింగ్స్ దాటినప్పటికీ, ఇది ‘విక్రమ్’ స్థాయికి దగ్గరలో లేదు.

గల్ఫ్, యూరప్, యుఎస్‌లో ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఉంది గానీ మాస్ మానియా మాత్రం కనిపించటం లేదు.

ఓపెనింగ్ రేస్‌లో ‘విక్రమ్’, ‘ఇండియన్ 2’ కంటే వెనుకబడిన ‘థగ్ లైఫ్’

‘విక్రమ్’ ఓపెనింగ్: ₹60 కోట్లు (వరల్డ్ వైడ్ గ్రాస్)

‘ఇండియన్ 2’ ఓపెనింగ్: ₹55 కోట్లు

‘థగ్ లైఫ్’ ఇప్పుడు ఆ స్థాయికి చేరడం కష్టమేనని ట్రేడ్ విశ్లేషణ.

క్లాసిక్ డైరెక్టర్ – మాస్ ఐకాన్ కాంబినేషన్‌కి ఇదా రిజల్ట్?

‘థగ్ లైఫ్’ కథ, విజన్ గొప్పదైనా… కమర్షియల్ ఎలిమెంట్స్, టార్గెట్ ఆడియన్స్‌కు ఏ మేరకి కనెక్ట్ అయ్యాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

అందుకే ఈ సినిమాకు ముందు రోజు నుంచే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ చాలా కీలకం. లేకపోతే, ఇది విక్రమ్ సునామీలా కాక, ఓ మాదిరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

, , , , ,
You may also like
Latest Posts from