దశాబ్దాలుగా వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట, ఇప్పుడు నిజజీవితంలోనూ ఒకటి కాబోతున్నారా? గత కొంతకాలంగా దళపతి విజయ్, త్రిషల మధ్య ఏదో నడుస్తోందంటూ వస్తున్న రూమర్లకు ఇప్పుడు గట్టి బలం చేకూరింది. మునుపెన్నడూ లేని విధంగా త్రిష తల్లి స్వయంగా రంగంలోకి దిగడంతో అభిమానుల మైండ్ బ్లాక్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే..

ఆ ఒక్క ‘లైక్’.. వెయ్యి అర్థాలు!
సోషల్ మీడియాలో విజయ్, త్రిష పెళ్లి చేసుకుంటున్నట్టు ఒక అభిమాని క్రియేట్ చేసిన ఫ్యాన్ మేడ్ రీల్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఆ వీడియోను త్రిష తల్లి ఉమ కృష్ణన్ లైక్ చేయడంతో ఒక్కసారిగా చర్చలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇది కేవలం పొరపాటున జరిగిన లైక్ ఆ? లేక రాబోయే శుభకార్యానికి ఇండైరెక్ట్ హింటా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్.

రాజకీయ సెగ.. వ్యక్తిగత రచ్చ!
మరోవైపు విజయ్ భార్య సంగీత విడాకుల కోసం అప్లై చేసిందన్న వార్తలు కోలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. విజయ్ ఒక స్టార్ హీరో మాత్రమే కాదు, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అధినేత కూడా. తమిళనాడు ఎన్నికల వేళ ఈ పెళ్లి వార్తలు ఆయన రాజకీయ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ఎంజీఆర్, కరుణానిధి వంటి దిగ్గజాలు తమ వ్యక్తిగత జీవితం, రాజకీయాలను బ్యాలెన్స్ చేసినా.. ఇప్పటి సోషల్ మీడియా కాలంలో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.

మౌనమే సమాధానమా?
ఇంత జరుగుతున్నా అటు విజయ్ గానీ, ఇటు త్రిష గానీ పెదవి విప్పడం లేదు. ఈ సైలెన్స్ వెనుక పెద్ద ప్లానే ఉందన్నది ఇండస్ట్రీ టాక్. త్రిష తల్లి చేసిన ఈ పనితో త్వరలోనే వీరిద్దరూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటూ నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు.

