సినిమా గాసిప్స్సినిమా వార్తలు

పవన్‌తో విడిపోయిన త్రివిక్రమ్? టాలీవుడ్‌లో మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్!

టాలీవుడ్ వెండితెరపై దశాబ్ద కాలంగా నడుస్తున్న అతిపెద్ద ‘షాడో’ సామ్రాజ్యం కుప్పకూలిందా? పవన్ కళ్యాణ్ ప్రాజెక్టుల వెనుక ఉండి చక్రం తిప్పే త్రివిక్రమ్ శ్రీనివాస్ సడన్ గా ఎందుకు చేతులెత్తేశారు? మెగా అభిమానుల సోషల్ మీడియా వార్‌కి భయపడ్డారా లేక పవన్‌తో గ్యాప్ పెరిగిందా? ఇప్పుడు ఫిలిం నగర్‌లో వినిపిస్తున్న ఒకే ఒక్క మాట.. త్రివిక్రమ్ ఈజ్ అవుట్!

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్.. ఈ ఇద్దరి అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. పవన్ ఏ కథ విన్నా, ఏ రీమేక్ ఓకే చేసినా దాని వెనుక త్రివిక్రమ్ కలామే ఉంటుంది. ముఖ్యంగా వరుస రీమేక్‌లతో త్రివిక్రమ్ పవన్‌ని లాక్ చేస్తున్నారంటూ మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ డైరెక్ట్ చేయకపోయినా, స్క్రిప్ట్ వర్క్ నుంచి ప్రొడక్షన్ డీల్స్ వరకు అన్నీ ఆయనే చూసుకునేవారు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.

తాజా సమాచారం ప్రకారం, త్రివిక్రమ్ ఇకపై పవన్ ప్రాజెక్టుల్లో వేలు పెట్టకూడదని ఫిక్స్ అయ్యారు. రీసెంట్‌గా ఒక టాప్ ప్రొడ్యూసర్ పవన్‌తో సినిమా సెట్ చేయమని త్రివిక్రమ్‌ను అడిగితే, ఆయన ముఖం మీదే “నో” చెప్పేశారట. తన సొంత ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, పవన్ భవిష్యత్ సినిమాల్లో తన ప్రమేయం ఉండబోదని తెగేసి చెప్పినట్లు వినికిడి.

మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, రామ్ తాళ్లూరి వంటి నిర్మాణ సంస్థలతో డైరెక్ట్‌గా డీల్స్ క్లోజ్ చేస్తున్నారు. స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండానే వచ్చే 2-3 ఏళ్ల కోసం భారీ లైన్ అప్ సెట్ చేసుకుంటున్నారు.

త్రివిక్రమ్ ప్రమేయం లేకపోవడం మెగా ఫ్యాన్స్‌కు ఒక విధంగా శుభవార్తే. ఎందుకంటే, ఇకపై పవన్ నుంచి స్ట్రెయిట్ సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే, ఇప్పటి వరకు పవన్ సినిమాలకి పెద్దన్నలా ఉన్న త్రివిక్రమ్ సడన్ గా తప్పుకోవడం వెనుక అసలు రీజన్ ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్.

ఏది ఏమైనా ‘గురూజీ’ మార్క్ స్క్రిప్ట్‌లు లేకుండా పవర్ స్టార్ మేజిక్ చేస్తారా? త్రివిక్రమ్ దూరం అవ్వడం పవన్ కెరీర్‌కు ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా? అనే క్యూరియాసిటీ ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది.

Similar Posts