సినిమా వార్తలు

USA బాక్సాఫీస్: ప్రభాస్ స్పీడ్‌ని పవన్ కళ్యాణ్ అందుకోలేకపోతున్నారా? ఉస్తాద్ లెక్క తారుమారు!

యూఎస్ మార్కెట్‌లో తెలుగు సినిమా సత్తా ఏంటో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మధ్య జరుగుతున్న బాక్సాఫీస్ ఫైట్ చూస్తుంటే సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ రేంజ్ కి రావాల్సిన కలెక్షన్స్ ప్రభాస్ సినిమా ముందు తేలిపోతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

రాజా సాబ్ ఊచకోత.. ఉస్తాద్ వెనకడుగు!

ప్రీ-సేల్స్ లెక్కలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రీమియర్స్ కి కేవలం 5 రోజులు మాత్రమే టైమ్ ఉన్నా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పటివరకు కేవలం 175 వేల డాలర్లు మాత్రమే రాబట్టింది. ఇదే టైమ్ లో ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఏకంగా 445 వేల డాలర్లతో ప్రభంజనం సృష్టించి, ఫైనల్ గా 1.4 మిలియన్ డాలర్ల మార్కును టచ్ చేసింది. పవన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నా, ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్ చూస్తుంటే ప్రభాస్ రికార్డులను అందుకోవడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ట్రైలర్ తోనే అసలైన గేమ్..

గతంలో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కూడా తక్కువ అంచనాలతో మొదలై యూఎస్ లో భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఉస్తాద్ ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలంటే ఇప్పటికే రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ ఒక్కటే ఆఖరి ఆయుధం. ట్రైలర్ కట్ అదిరిపోయింది. కాబట్టి లాస్ట్ మినిట్ లో బుకింగ్స్ పెరిగే ఛాన్స్ ఉంది. గ్లింప్స్ తోనే గూస్ బంప్స్ తెప్పించిన పవన్ కళ్యాణ్, ట్రైలర్ తో యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టిస్తారో చూడాలి.

అడ్వాన్స్ బుకింగ్స్ లో ప్రస్తుతం ప్రభాస్ హైలెట్ గా కనిపిస్తున్నా, పవర్ స్టార్ మేనియా ఒక్కసారి మొదలైతే రికార్డులన్నీ గల్లంతు అవ్వడం ఖాయం. ఉస్తాద్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన వారికి పండగ చేసారు.

Similar Posts