
విజయ్-రష్మిక పెళ్లి ముహూర్తం ఫిక్స్! సీఎం రేవంత్ రెడ్డికి పెళ్లి కార్డు.. గెస్ట్ లిస్ట్‌లో ఆ స్టార్స్!
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్త ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. గత కొన్నేళ్లుగా తాము కేవలం స్నేహితులమేనని చెబుతున్న ఈ జంట, ఇప్పుడు ఏకంగా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీరి వివాహం జరగబోతోందని తెలుస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెళ్లి పిలుపు!
తాజాగా విజయ్ దేవరకొండ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. తన వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ విజయ్ స్వయంగా సీఎంకు పెళ్లి పత్రికను అందించినట్లు సమాచారం. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, విజయ్-రష్మికల పెళ్లి దాదాపు ఖాయమని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

ఉదయ్‌పూర్‌లో రాయల్ వెడ్డింగ్.. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్!
రిపోర్ట్స్ ప్రకారం, ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఒక చారిత్రక ప్యాలెస్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్‌గా వివాహం జరగనుంది. అయితే, మెయిన్ వేడుక మాత్రం హైదరాబాద్‌లో ఉండబోతోంది. మార్చి 4న ఒక ప్రముఖ కన్వెన్షన్ సెంటర్‌లో సినీ,రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
షాకింగ్ గెస్ట్ లిస్ట్.. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా!
ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న స్టార్ సెలబ్రిటీలు హాజరుకాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, సందీప్ రెడ్డి వంగా వంటి ప్రముఖులు అతిథుల జాబితాలో ఉన్నారట.
బాలీవుడ్: సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, కరణ్ జోహార్, షాహిద్ కపూర్, కృతి సనన్ వంటి స్టార్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గోప్యంగా పెళ్లి ఏర్పాట్లు.. రూ. 60 కోట్ల ఆఫర్ రిజెక్ట్?
విజయ్ , రష్మిక తమ పెళ్లిని పూర్తిగా ప్రైవేట్‌గా ఉంచాలని నిర్ణయించుకున్నారట. పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కుల కోసం ఒక ప్రముఖ OTT సంస్థ దాదాపు రూ. 60 కోట్లు ఆఫర్ చేసినా, విజయ్ దానిని తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది అక్టోబర్‌లోనే వీరిద్దరికీ రహస్యంగా నిశ్చితార్థం జరిగిందని, అప్పటి నుండి ఈ ప్లానింగ్ అంతా జరుగుతోందని ఇన్సైడర్ టాక్.
