మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ చుట్టూ ఇప్పుడు అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సినిమా షూటింగ్ ఆలస్యం కావడం, విజువల్ ఎఫెక్ట్స్ పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ మూవీ బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈ చిత్ర ఓటీటీ డీల్ విషయంలో జరిగిన ఒక డెవలప్మెంట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల మైండ్ బ్లాక్ చేస్తోంది.
ప్రైమ్ వీడియో హ్యాండ్ ఇచ్చింది.. సీన్ రివర్స్!
నిజానికి ‘విశ్వంభర’ ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో మొదట్లో భారీ ఆఫర్ ఇచ్చింది. అయితే మేకర్స్ అప్పుడు ఆ ఆఫర్ ను హోల్డ్ లో పెట్టి, సినిమా క్రేజ్ ఇంకా పెరిగాక ఇంకా పెద్ద డీల్ క్లోజ్ చేయొచ్చని భావించారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ కాస్తా బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, ప్రైమ్ వీడియో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ డేట్ లో క్లారిటీ లేకపోవడం, బడ్జెట్ పరిమితుల దృష్ట్యా అమెజాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్.

రంగంలోకి జీ5 (ZEE5).. చర్చలు సక్సెస్ అవుతాయా?
ప్రైమ్ వీడియో తప్పుకోవడంతో మేకర్స్ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ప్రస్తుతం జీ5 (ZEE5) తో డిజిటల్ మరియు శాటిలైట్ హక్కుల కోసం చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. నాన్-థియేట్రికల్ డీల్స్ అన్నీ క్లోజ్ చేసిన తర్వాతే అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని టీమ్ భావిస్తోంది. అయితే మొదట అనుకున్న రేటు కంటే ఇప్పుడు తక్కువకే డీల్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రమోషన్లతో రచ్చ మొదలవ్వాల్సిందే!
ఓటీటీ డీల్ ఒక కొలిక్కి రాగానే సినిమా ప్రమోషన్లను అగ్రెసివ్ గా స్టార్ట్ చేయాలని వశిష్ట అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. చిరంజీవి మాస్ ఇమేజ్, ఫాంటసీ జోనర్ కాబట్టి డీల్ విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండదని మేకర్స్ ధీమాగా ఉన్నారు. గ్రాఫిక్స్ పనులను మరింత క్వాలిటీగా తీర్చిదిద్ది, బాక్సాఫీస్ వద్ద మెగా వండర్ క్రియేట్ చేయాలనే కసితో మూవీ టీమ్ ఉంది.
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఎవరో తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

