గతంలో రిలీజైన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ కెరీర్ పూర్తిగా వెనక్కి వెళ్లింది. అయితే ఇప్పుడు అతను తిరిగి ఫోకస్ లోకి రావాలనుకుంటున్నాడు — అది కూడా ఒక చారిత్రక యోధుడి అవతారంలో!

‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డితో కలిసి #Gopichand33 అంటూ రూపొందుతోన్న కొత్త పీరియాడిక్ యాక్షన్ డ్రామా, గోపీచంద్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలవనుందనే బలమైన సంకేతాలు కనబడుతున్నాయి. తాజాగా, గోపీచంద్ బర్త్ డే సందర్భంగా మూవీ టీం విడుదల చేసిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ అంచనాలకు మరింత బలం చేకూర్చాయి.

గోపీచంద్ లుక్ – ఓ యోధుడి పునరావిష్కరణ!

పొడవాటి జుట్టు, గడ్డం, కళ్లలో గంభీరత, చర్మంపై ఉగ్ర సింధూరం… ఇలా గోపీచంద్ లుక్ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసి, సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యేలా చేసింది. మంచు పర్వతాల్లో ఒక గుడారంనుంచి ప్రశాంతంగా బయటకు వచ్చిన యోధుడిగా, తన గుర్రాన్ని ప్రేమగా నిమరుతూ కనిపించే గోపీచంద్ “ధీర ధీర…” అంటూ వినిపించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ goosebumps కలిగిస్తోంది.

7వ శతాబ్దం నేపథ్యంలో

ఈ సినిమా 7వ శతాబ్దంలో జరిగిన ఓ మరిచిపోయిన చారిత్రక సంఘటన ఆధారంగా రూపొందుతోంది. ఇప్పటిదాకా టాలీవుడ్‌లో తక్కువగా టచ్ చేసిన పీరియడ్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి భారీ బడ్జెట్, విజువల్స్, ఇంటెన్స్ నారేషన్ అన్నీ హైలైట్స్‌గా మారనున్నాయి.

సంకల్ప్ రెడ్డి ఘాజీతో సముద్రం లోతుల్లోకి, అంతరిక్షంతో అంతరిక్షపు మౌనంలోకి, ఇప్పుడు ఆయన చరిత్రలోకి ప్రయాణం పెట్టుకున్నారు.

లొకేషన్లు, ప్రొడక్షన్ హైప్

మూవీ మొదటి షెడ్యూల్ కశ్మీర్‌లోని అద్భుతమైన లొకేషన్లలో షూట్ కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో రెండో షెడ్యూల్ సాగుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ అధినేత శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.

గోపీచంద్‌కు ఈ హిట్ అత్యవసరం

ఈ సినిమాతో గోపీచంద్ తన స్థాయి తిరిగి నిరూపించుకునే అవకాశాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సంకల్ప్ రెడ్డి వంటి క్రాఫ్ట్ మాస్టర్ దిశానిర్దేశంలో, ఈ చరిత్రాత్మక యుద్ధగాథలో గోపీచంద్ చేసే ప్రయాణం అతని కెరీర్‌ను తిరిగి వెలుగులోకి తెస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

, ,
You may also like
Latest Posts from