సినిమా వార్తలు

“ఆ రోజు నేను వెళ్లి ఉంటే…?” కిడ్నాప్ కేసుపై నటి షాకింగ్‌ రివలేషన్!

ముంబయిని కుదిపేసిన పిల్లల నిర్బంధ ఘటనపై ఆశ్చర్యకర విషయాలు బయటకు వస్తున్నాయి. ప‌వయీ లోని ఆర్‌ఏ స్టూడియోలో చిన్నారులను బందీలుగా పెట్టిన రోహిత్ ఆర్య (50) గురించి తాజాగా మరాఠీ నటి రుచితా విజయ్ జాదవ్ షాకింగ్ పోస్టు చేశారు.

తాను కూడా ఆ రోహిత్‌ని కలవాల్సి ఉందని… “చివరి నిమిషంలో క్యాన్సిల్‌ చేయకపోతే నేడు నా కథ కూడా వేరేలా ఉండేది” అంటూ వణికిపోయారు.

నటి సంచలన పోస్ట్ – ప్రధాన అంశాలు

రోహిత్ ఆర్య తనను ప్రొడ్యూసర్‌గా పరిచయం చేసుకున్నాడట.“కిడ్నాపింగ్‌ నేపథ్యంలో సినిమా” చేస్తున్నానని చెప్పాడట. కథ వినేందుకు ఆమె అంగీకరించిందట అక్టోబర్ 28న ముంబయిలో మీటింగ్ సెటప్. 27న స్టూడియో లొకేషన్ పంపించాడు. చివరి నిమిషంలో రద్దు చేసిన మీటింగ్

రెండు రోజుల తరువాత అదే స్టూడియోలో పిల్లల నిర్బంధం తెలిసి షాక్!

నటి భావోద్వేగ పోస్టు హైలైట్

“అతడే పిల్లలను బంధించినవ్యక్తి అని తెలుసుకొని నడిరాత్రి కలలో భయమేసినట్లు అయ్యింది. ఆ రోజు ఏదో దేవుళ్లు కాపాడినట్లు అనిపిస్తోంది.
కొత్త వాళ్లను గుడ్డిగా నమ్మకండి.”

ఏమైంది అసలు?

ఆడిషన్‌ పేరుతో వచ్చిన చిన్నారులను రోహిత్ స్టూడియోలో బంధించాడు. పోలీసులు ఆపరేషన్ చేసి పిల్లలను కాపాడి అతడిని కాల్చివేశారు.
ఇవే క్షణాల్లో అతడు సోషల్ మీడియా లైవ్ కూడా పెట్టాడు!

నటి హెచ్చరిక

ఎవరి దగ్గరకు వెళ్తున్నారో కుటుంబ సభ్యులకు చెప్పండి

కొత్త పరిచయాలపై ఎగస్ట్రా జాగ్రత్త

గుడ్డి నమ్మకం = ప్రమాదం

ఈ కథ సినిమాల్లో కాదు… నిజ జీవితంలో!

ఆ టైంలో, ఆమె అక్కడ ఉంటే ఏం జరిగేదో ఊహించండి..!

ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అందరం అప్రమత్తంగా ఉండాలి.

Similar Posts