మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కుటుంబంలోకి కవలల రాకతో పండుగ వాతావరణం నెలకొంటే, మరోపక్క సోషల్ మీడియాలో ట్రోల్స్ కలకలం రేపాయి. ఒక తమిళ జర్నలిస్ట్ చిరంజీవిపై చేసిన సెటైర్లకు, మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఇచ్చిన ఘాటు సమాధానం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

కవలల రాక.. హాస్పిటల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ!

జనవరి 31, 2026న రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన దంపతులకు కవలలు (ట్విన్స్) జన్మించిన సంగతి తెలిసిందే. ఈ సంతోష సమయంలో క్లిన్ కారాతో కలిసి చరణ్ హాస్పిటల్‌కు రాగా.. ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. హాస్పిటల్ ప్రాంగణంలో అర్ధరాత్రి బాణసంచా కాల్చడం, చరణ్‌ను చుట్టుముట్టడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో చిరంజీవి గతంలో చేసిన “వారసుడు కావాలి” అనే కామెంట్స్‌ను బయటకు తీసి నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

చిరంజీవిపై తమిళ జర్నలిస్ట్ సెటైర్లు.. లావణ్య ఎంట్రీ!

ఒక ప్రముఖ తమిళ జర్నలిస్ట్, మెగాస్టార్‌ను టార్గెట్ చేస్తూ చౌకబారు ట్వీట్ చేశాడు. సాధారణంగా సైలెంట్‌గా ఉండే వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి, ఈసారి మాత్రం అస్సలు తగ్గలేదు. మెగాస్టార్ పరువు తీసేలా ఉన్న ఆ ట్వీట్‌పై ఆమె పబ్లిక్‌గానే విరుచుకుపడ్డారు.

“మీకు ఆ స్థాయి లేదు!” – లావణ్య ఘాటు రిప్లై

“సాధారణంగా ఇలాంటి ట్వీట్లను నేను పట్టించుకోను.. కానీ మీ నుండి ఇది అస్సలు ఊహించలేదు. ఒక సంతోషకరమైన విషయాన్ని ఇంత అసహ్యంగా మార్చడం మీకే చెల్లింది. మా మావయ్య (చిరంజీవి) తన ఇంట్లోని ఆడవాళ్లను, ముఖ్యంగా మనవరాళ్లను ఎంత గౌరవంగా చూస్తారో మీకు తెలియదు. ఆయన చేసే దాంట్లో ఒక శాతం కూడా మిగిలిన మగవారు చేయలేరు. తెలియని వ్యక్తుల గురించి మాట్లాడటం మానేయండి” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

లావణ్య దెబ్బకు సదరు జర్నలిస్ట్ తన ట్వీట్‌ను వెంటనే డిలీట్ చేయడం విశేషం. మెగా కోడలు చూపించిన ఈ ధైర్యానికి మెగా ఫ్యాన్స్ ‘సూపర్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

#Chiranjeevi, #Lavanya Tripathi, #Mega Family, #Ram Charan, #Tamil Journalist Trolling

By admin