
తెలంగాణలో ‘అఖండ 2’ కు బ్రేకులు! ఫ్యాన్స్ ఆగ్రహం!
టాలీవుడ్ చివరి భారీ రిలీజ్‌గా ఎదురు చూస్తున్న ‘అఖండ 2: తాండవం’ పై హైప్ ఆకాశాన్నంటుతోంది. ప్రీమియర్ షోలు మొదలుకావడానికి ఇంకా కొద్ది గంటలే ఉన్నాయి, కానీ తెలంగాణలో మాత్రం ఒక షాకింగ్ సిట్యువేషన్ ఏర్పడింది —
అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు!
APలో ఫుల్ రన్… కానీ తెలంగాణలో GO ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజుల క్రితమే GO ఇష్యూ చేసింది.
APలో:
ప్రీమియర్ షెడ్యూల్స్ రెడీ
ఆన్‌లైన్ టికెట్స్ అమ్ములు స్టార్ట్
ఫ్యాన్స్ థియేటర్లకు లైన్లో
కానీ తెలంగాణలో మాత్రం…
GO లేదు
అడ్వాన్స్ బుకింగ్స్ లేవు
ఫ్యాన్స్ పూర్తిగా కన్ఫ్యూజన్‌లో
దిల్ రాజు Nizam రైట్స్ కొన్నా… బుకింగ్స్ మాత్రం బ్లాక్!
నిజాం టెరిటరీని భారీ మొత్తానికి దిల్ రాజు తీసుకున్నారు. కానీ GO లేకపోవడంతో పరిస్థితి క్లారిటీ లేకుండా పోయింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రియాక్షన్స్ ఒకటే — “మేము ఎప్పుడు బుక్ చేసుకోవాలి? ప్రీమియర్‌కి ఎలా వెళ్లాలి?”
అఖండ 2 తాండవం విషయంలో చిత్ర నిర్మాతలకు రేవంత్ రెడ్డి సర్కారు పెంపుదల ఉండదని చెప్పినట్టు సమాచారం. కేవలం ప్రీమియర్స్ కు మాత్రమే పర్మిషన్స్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఏదో సమయంలో తెలంగాణాలో బుక్కింగ్స్ మొదలవుతాయి ఖచ్చితంగా అనేది మాత్రం నిజం.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ సినిమా అఖండ 2 తాండవం. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బాలకృష్ణ చిన్న కూతురు ఎం తేజస్విని నందమూరి ఈ సినిమాను సమర్పిస్తున్నారు. నిర్మాతగా ఆమెకు ఇది ఫస్ట్ మూవీ అని చెప్పాలి.
