ఇప్పుడు దేశంలో మరాఠ యోధుడు, హిందూ సామ్రాజ వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ, అతని కొడుకు ఛత్రపతి శంభాజీ మహారాజ్ ల గురించి తీవ్రంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. మరాఠా యోధుల చరిత్రను “ఛావా” పేరుతో సిల్వర్ స్క్రీన్ మీద చూస్తూ.. ప్రేక్షకులు ఉద్వేగానికి లోనవుతున్నారు. శంభాజీ జీవితంలోని కీలక ఘట్టాలు, ఆయన పాలనా తీరును, మతం మార్చుకోమంటూ విదేశీ ఇస్లాం పాలకులు పెట్టిన చిత్రహింసల ఘటనల్ని తెరపై చూస్తూ.. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ మహారాజ్ గురించి వికీపీడియాలో ఉన్న సమాచారం సరైంది కాదంటూ పోలీస్ కేసులు పెట్టడం జరిగింది.

శంభాజీ మహరాజ్‌(Sambhaji Maharaj) గురించి వికీపీడియాలో అభ్యంతరకర సమాచారం పోస్ట్‌ అయ్యింది. ఈ విషయం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ దృష్టికి వెళ్లింది. దీంతో కంటెంట్‌ తొలగింపు దిశగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తమ ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ వారసుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ గురించి కొందరు కావాలని అభ్యంతకర కంటెంట్‌ను పోస్ట్‌ చేసారు. దాంతో వికీపీడియాపై మరాఠాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ముంబై సైబర్‌ సెల్‌ వికీపీడియా(Wikipedia)కు నోటీసులు జారీ చేసింది. ఆ కంటెంట్‌ను తొలగించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది.

మరోవైపు సున్నితమైన ఇలాంటి అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం ఫడ్నవిస్‌ అభిప్రాయపడ్డారు. ఎవరైనా ఎడిట్‌ చేయగలిగే వికీపీడియాలో.. ఎడిటోరియల్‌ నియంత్రణ లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు

, ,
You may also like
Latest Posts from ChalanaChitram.com