సినిమా వార్తలు

రెహమాన్ సంచలన వ్యాఖ్యలు.. ఇండస్ట్రీలో ఆధిపత్యం వెనుక ‘మతం’ ఉందా? క్లారిటీ ఇచ్చిన మ్యూజిక్ మాస్ట్రో!

ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఎప్పుడూ తన పని తాను చేసుకుపోయే రెహమాన్, ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో పెద్ద మంటలే రేపాయి. అయితే పరిస్థితి చేయి దాటుతుండటంతో ఆయన వెంటనే స్పందించి ఒక వివరణాత్మక వీడియోను విడుదల చేశారు.

అసలేం జరిగింది? వివాదం ఏంటి?

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో ఒకరకమైన ‘పవర్ షిఫ్ట్’ జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సృజనాత్మకత లేనివారే ఇండస్ట్రీని ఏలుతున్నారని, దీనికి మతపరమైన అంశాలు కూడా కారణం కావొచ్చని ఆయన అనడం పెద్ద చర్చకు దారితీసింది.

ఈ వ్యాఖ్యలపై పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. రెహమాన్ తనపై వివక్ష చూపిస్తున్నారనే అర్థం వచ్చేలా మాట్లాడటం తప్పు అని తప్పుబట్టారు.

“నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు”

వివాదం ముదురుతుండటంతో రెహమాన్ ఒక వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు.

భారతదేశం నా ఇల్లు: “భారతదేశం నా ఇల్లు.. నా గురువు.. నా స్ఫూర్తి. కొన్నిసార్లు మన అభిప్రాయాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటారని ఇప్పుడు తెలుసుకున్నాను” అని ఆయన పేర్కొన్నారు. తన ఆలోచన ఎప్పుడూ సంగీతాన్ని గౌరవించడమే తప్ప ఎవరినీ బాధపెట్టడం కాదని, తన నిజాయితీని అర్థం చేసుకోవాలని కోరారు.

భారతీయుడిగా గర్విస్తున్నా:

భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్న ఈ దేశంలో భారతీయుడిగా పుట్టడం తన అదృష్టమని రెహమాన్ ఎమోషనల్ అయ్యారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు.. జై హింద్! తను చేస్తున్న భారీ ప్రాజెక్టుల గురించి చెబుతూ దేశభక్తిని చాటుకున్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ‘వేవ్స్ సమ్మిట్ – 2025’లో ప్రదర్శన ఇవ్వడం తన జర్నీని బలోపేతం చేస్తుందన్నారు.

రామాయణ ప్రాజెక్ట్: హన్స్‌ జిమ్మర్‌తో కలిసి ‘రామాయణ’ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.

చివరిగా ‘మా తుఝే సలామ్’, ‘వందేమాతరం’ విజువల్స్‌తో కూడిన వీడియోను షేర్ చేస్తూ ‘జై హింద్, జయహో’ అని ముగించారు.

Similar Posts