ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అనేక తెలుగు సినిమాలకు లీకుల బెడద వెంటాడుతూనే ఉంది. మొన్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, రీసెంట్ గా రజనీకాంత్ కూలీలో చేస్తున్న నాగార్జున సీన్స్ ఇలా వరస పెట్టి లీక్ ల పర్వం సాగుతూనే ఉన్నాయి. అప్పటికీ ఎప్పటికప్పుడు లీక్ చేసిన వారిని పట్టుకుని వారిపై కాపీ రైట్స్, ఐటీ సెక్షన్ల క్రింద పోలీస్ లు కేసులు నమోదు చేస్తున్నారు. అదే సమయంలో లీక్ అయిన సీన్స్ కుర్రాళ్ల వాట్సప్, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూండటంతో పెద్ద సినిమాల దర్శకులు , హీరోలు ఈ విషయమై సీరియస్ గా దృష్టి పెట్టారు. రీసెంట్ గా రాజమౌళి తను మహేష్ బాబు తో చేస్తున్న సినిమాకు లీక్ లు కాకుండా స్ట్రిక్టుగా జాగ్రత్తలు తీసుకున్నారని తెలిసింది. ఇప్పుడు రామ్ చరణ్ సైతం అదే బాటలో ప్రయాణం పెట్టుకున్నారని వినికిడి.
బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న RC16 సినిమా నుంచి ఎలాంటి లీక్ లు జరగకుండా టీమ్ జాగ్రత్తలు తీసుకుంటోంది.
భారీ అంచనాలు ఉన్న ఈ ప్రాజెక్ట్ నుండి ఎలాంటి లీక్‌లు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. సెట్‌లో నో-ఫోన్ విధానాన్ని అమలు చేయడానికి ప్రొడక్షన్ లో 10 నుండి 12 మంది బౌన్సర్‌లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్తిత్లోనూ ఫోన్ తో సెట్ లోకి రావటానికి వీల్లేదు.
మొబైల్ ఫోన్‌లతో సెట్‌లోకి ఎవరూ రాకుండా చూడటం వారి భాధ్యత . రోజు ప్రారంభంలో ఫోన్‌లు సేకరించి, షూటింగ్ ముగిసిన తర్వాత తిరిగి ఇస్తారు.
‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రమోషన్స్ కోసం గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ తిరిగి RC16 షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. సినిమా కొత్త షెడ్యూల్‌ను దర్శకుడు మొదలు పెట్టారు.
మొదటి సినిమా ‘ఉప్పెన’తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు బుచ్చిబాబు రెండో సినిమాకే రామ్ చరణ్‌ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు.