పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రతీ కదిలికా అభిమానులు దృష్టిలో పడుతూనే ఉంటుంది. అలాగే మీడియా కూడా ఓ కన్నేసి ఉంచుతుంది. ప్రస్తుతం ప్రభాస్ ఇటలీలో ఉన్నాడని సమాచారం. సినిమా షూటింగ్ కోసం అయితే జనం అసలు పట్టించుకోరు. అయితే ఇక్కడ ఓ ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఈ ట్రిప్ వెకేషన్ కోసమా? లేక ఆరోగ్య కోసమా?
అభిమానులను ఆందోళనకు గురి చేసిన మోకాళ్ళ నొప్పి
ప్రభాస్ గత కొన్ని నెలలుగా కొన్ని ప్రాజెక్టులకు గ్యాప్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. “సలార్ “, “కల్లి” వంటి భారీ ప్రాజెక్ట్స్ తర్వాత, ఆయన తక్కువగా పబ్లిక్‌లో కనిపించటం అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేసింది. అయితే ఆయన ఫౌజి షూటింగ్ లో బిజిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇటిలీలో ఉన్నారు. అక్కడ ఓ విలేజ్ లో ట్రీట్మంట్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రభాస్‌కి తలెత్తిన మోకాళ్ల నొప్పి కారణంగా రెగ్యులర్ ఫిజియోథెరపీ అవసరం అయ్యిందట.
ఇటలీ ట్రిప్: రిఫ్రెష్‌మెంట్ & రికవరీ మిషన్?
ఇటలీ టూర్ చూసి కొందరు అభిమానులు “వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు” అనుకుంటే, ఇంకొందరు మాత్రం “బాడీ & మైండ్ హీలింగ్ జరుపుకుంటున్నాడు” అంటున్నారు. ప్రభాస్ మైండ్‌ను కూడా డిటాక్స్ చేయడానికి ఇటలీ అంతకంటే బెస్ట్ ప్లేస్ ఉందా? అని అంటున్నారు
ఇక సోషల్ మీడియా రియాక్షన్స్
ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల కామెంట్స్ సరదాగా ఉన్నాయి:
ఒక్కరు అయితే “మా డార్లింగ్కు ఇటలీ గాలే ఔషధం!”
మరొకరు అయితే “ప్యాకప్ అనుకోకండి బ్రదర్స్, ఇది ఓ రికవరీ మిషన్!”
వేరొకరు “ఇటలీ కాఫీ+ఆర్ట్+ఫిజియో = ప్రభాస్ ట్రీట్‌మెంట్ ప్లాన్!”
ప్రభాస్ ఇటలీ టూర్ వెనుక ఉన్న మిస్టరీలో వెకేషన్ కంటే హీలింగ్ ఎలిమెంట్ ఎక్కువగా కనిపిస్తోంది. అభిమానులకైతే… డార్లింగ్ హెల్తీగా తిరిగి రావడమే ముఖ్యమన్నమాట!
రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్ లు పెండింగ్ లో వున్నాయి. రాజా సాబ్ కు పాటలు, కొన్ని రోజులు షూట్ పెండింగ్ వుంది. ఫౌజీ పనులు చాలా వున్నాయి. మరో ప్రక్క సందీప్ వంగా సినిమా సెట్ మీదకు వెళ్లాలి. దాన్ని 2026 సమ్మర్ కు అని టాక్ వుంది.