మ‌ల‌యాళంలో బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సాధించిన మోహ‌న్ లాల్ ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’ (L2: Empuraan) . ఈ సినిమా తెలుగులో వర్కవుట్ కాలేదు. ఇక్కడెవరూ పెద్దగా పట్టించుకోలేదు. మంచి రివ్యూలు వచ్చినా ఆ థియేటర్స్ ఖాళీగానే ఉన్నాయి. తాజాగా ఓటీటీలోకి వ‌చ్చేసింది. అయితే ఓటిటిలో ఎలా ఉంది రెస్పాన్స్ అంటే…

L2: ఎంపురాన్ అన్ని సౌత్ ఇండియన్ భాషలలో JioHostarలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే రెస్పాన్స్ మాత్రం ఘోరంగా ఉంది. ఇది కచ్చితంగా టీమ్‌కి షాక్‌. ముఖ్యంగా ఈ టైటిలే తెలుగు వారిని కానీ మిగతా భాషల వారని కానీ ఆకట్టుకోవటం లేదని తెలుస్తోంది. దాన్నో అర్దం కానీ సినిమాగా ప్రక్కన పెట్టేస్తున్నారు. కాబట్టి, ఈ షాకింగ్ రిసెప్షన్‌తో ఫ్రాంచైజీలో భారీ బడ్జెట్‌తో మరో సినిమా చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్నదని టీమ్ టీమ్ టెన్షన్ పడుతోందని సమాచారం.

ఈ సినిమాలో మలయాళీ సూపర్ స్టార్, నటుడు మోహన్‌లాల్ (Mohanlal) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌గా.. మ‌ల‌యాళ న‌టుడు, ద‌ర్శ‌కుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మంజు వారియ‌ర్ (Manju Warrier), టోవినో థామస్(Tovino Thomas) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

మార్చి 27న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ఒకవైపు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతునే మ‌రోవైపు వివాదాల్లో చిక్కుకుంది. రీసెంట్‌గా ఈ చిత్రం రూ.250 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను కూడా రాబ‌ట్టింది. అయితే ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.

ప్ర‌ముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో నేటి నుంచి ఈ చిత్రం తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

, , , , ,
You may also like
Latest Posts from