భారతీయ సినీ తారలతో భారీ బడ్జెట్‌ చిత్రాలు నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ఇప్పటికే పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్ తదితరుల సినిమాలను నిర్మిస్తోంది. త్వరలోనే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, అజిత్‌ వంటి ప్రముఖులతో కూడా సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయి ప్రాజెక్టులు లైన్‌లో పెట్టింది. గతంలో ఉప్పెన వంటి సినిమాలు నిర్మించిన ఈ సంస్థ, ఇటీవల ఎక్కువగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చింది.

ఇప్పుడేమో, రాబోయే కాలంలో కంటెంట్‌ బలం ఉన్న సినిమాలను నిర్మించడానికి మైత్రి సీరియస్‌గా ప్లాన్ చేస్తోంది. స్టార్ హీరోలేమీ లేకుండా, చిన్న బడ్జెట్‌ చిత్రాలతో కొత్త ప్రతిభను పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు. నాన్-థియేట్రికల్‌ మార్కెట్‌లో వీరికి ఉన్న బలమైన హోల్డ్‌ వల్ల, ఈ చిన్న సినిమాల ఖర్చును సులభంగా రికవర్‌ చేసుకోగలరు. అంతేకాక, తమ స్వంత డిస్ట్రిబ్యూషన్‌ ప్లాట్‌ఫారమ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో, రాబోయే సంవత్సరాల్లో వరుసగా చిన్న, కంటెంట్‌-డ్రివెన్‌ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే మైత్రి మూవీ మేకర్స్ లక్ష్యం.

You may also like
Latest Posts from