భారతీయ సినిమా గమనంలో 1975లో వచ్చిన షోలే ఒక సంచలనం సృష్టించింది. యాక్షన్, డ్రామా, ఎమోషన్, మ్యూజిక్—ఇవన్నీ ఒకే కథలో కలగలిసి, తరతరాల ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. హిందీ సినిమాలో “క్లాసిక్” అంటే దానికి మొదటి ఉదాహరణ షోలే అని చెప్పినా అతిశయోక్తి కాదు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమామాలిని, జయా భదూరి, సంజీవ్ కుమార్ నటనతో పాటు అమ్జద్ ఖాన్ పోషించిన గబ్బర్ సింగ్ పాత్ర హిందీ సినిమా విలన్లలో ఒక చరిత్రే.

షోలే హిల్స్‌ — సినిమా నుంచి టూరిస్టు ఆకర్షణగా

కొన్ని షూటింగ్ లొకేషన్లు వాటి క్లాసిక్ స్థాయితోనే చిరస్మరణీయమవుతాయి. ఇటీవల బాహుబలి సెట్ రామోజీ ఫిల్మ్ సిటీలో పర్యాటక ఆకర్షణగా మారినట్టు, చాలా ఏళ్ల క్రితమే షోలే సినిమా షూటింగ్ లొకేషన్ కర్ణాటకలోని రామనగరలోని రాళ్ల కొండలు విశేష ఖ్యాతి సంపాదించాయి.

షోలేలోని కల్పిత గ్రామం “రామ్‌గఢ్” , గబ్బర్ సింగ్ గుహ ఈ రామనగర రాకీ హిల్స్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించబడ్డాయి. కోట్లాది సినీప్రేమికులు కళ్ళు మూసుకుని కూడా ఈ ప్రదేశాన్ని గుర్తించగలరు. బెంగళూరుకు దగ్గరగా ఉన్న ఈ కొండలు, వల్చర్‌ సాంక్చువరీగా కూడా గుర్తింపు పొందాయి. సినిమాలో గబ్బర్ సింగ్ గూడు అయిన ఈ కొండలు, ఆయన పేరుతో కాకుండా షోలే హిల్స్ గా ప్రసిద్ధి చెందాయి—కారణం, షోలే అనే పేరు దేశమంతటా నిత్య జీవితంలో పదంగా మారిపోవడం.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గబ్బర్ సింగ్ పాత్ర నిజజీవితంలో చంబల్ లోయలో ఉన్న ఒక డాకాయిత్ నుంచి ప్రేరణ పొందింది. మొదట ఈ పాత్ర కోసం డ్యానీ డెంజోంగ్పా ను ఎంపిక చేశారు, కానీ ఆయన మరో సినిమా బిజీ కారణంగా ఈ అవకాశం అమ్జద్ ఖాన్‌కి దక్కింది—దాంతో ఆయన పేరు, పాత్ర రెండూ చరిత్రలో నిలిచిపోయాయి.

, ,
You may also like
Latest Posts from